భాషా పండితులపై ప్రభుత్వం చిన్నచూపు
ABN , First Publish Date - 2023-02-06T22:19:31+05:30 IST
భాషా పండితుల సమస్యలపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని రాష్ట్రీయ ఉపాఽధ్యాయ పండిత పరిషత్ జిల్లా ఉపాధ్య క్షుడు సత్యనారాయణ అన్నారు.
ఏసీసీ, ఫిబ్రవరి 6: భాషా పండితుల సమస్యలపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని రాష్ట్రీయ ఉపాఽధ్యాయ పండిత పరిషత్ జిల్లా ఉపాధ్య క్షుడు సత్యనారాయణ అన్నారు. సోమవారం భాషా పండితులకు బది లీలు, ప్రమోషన్‌లు కల్పించాలని డిమాండ్ చేస్తూ డీఈవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ భాషా పండితులకు ప్రమోషన్‌లు ఇచ్చే వరకు 9, 10 తరగతులను బోఽధించమని, సహాయ నిరా కరణను కొనసాగిస్తామన్నారు. నాయకులు సత్యనారాయణ, శ్రీనివాసవర్మ, వేణుగోపాల్, విశ్వప్రసాద్, సురేందర్, శ్రీధరస్వామి పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేష న్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో ఏవో సురేష్‌కు వినతిపత్రం అంద జేశారు. వారు మాట్లాడుతూ భాషా పండితులు, పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్‌గా అప్‌గ్రేడ్ చేసి ప్రమోషన్‌లు ఇవ్వాలన్నారు. అసెంబ్లీలో ప్రక టించిన విధంగా 5571 ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎం పోస్టులను మం జూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శ కంగా నిర్వహించాలని, సీనియార్టీ జాబితాలో దొర్లిన తప్పులను సవరించా లన్నారు. ఆశ్రమ పాఠశాలలు, మోడల్ స్కూల్‌లు, గురుకులా లు, కేజీబీవీ ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలన్నారు. గొల్ల రామన్న, గుర్రాల రాజవేణు పాల్గొన్నారు.