గ్రామ పంచాయతీలు మరింత అభివృద్ధి చెందాలి
ABN , First Publish Date - 2023-03-25T23:10:10+05:30 IST
గ్రామపంచాయ తీలో అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. శనివారం పటేల్ గార్డెన్‌లో ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా అభివృద్ధి, పారిశుధ్య విభాగంలో ఉత్తమ గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం దీన్ దయాల్ ఉపాధ్యాయ సతత్ వికాస్ పురస్కారాలను, ప్రశంసా పత్రాలను సర్పంచులు, కార్యదర్శులకు అందజేశారు.
మంచిర్యాల కలెక్టరేట్, మార్చి 25: గ్రామపంచాయ తీలో అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. శనివారం పటేల్ గార్డెన్‌లో ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా అభివృద్ధి, పారిశుధ్య విభాగంలో ఉత్తమ గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం దీన్ దయాల్ ఉపాధ్యాయ సతత్ వికాస్ పురస్కారాలను, ప్రశంసా పత్రాలను సర్పంచులు, కార్యదర్శులకు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 16 గ్రామపంచాయ తీలు ఆరోగ్య విభాగం, చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ, నీటి పారుదల, పారిశుధ్యం, పచ్చదనం తదితర 9 విభా గాల్లో అవార్డులు సాధించాయన్నారు. మరింత బాధ్య తతో అభివృద్ధి వైపు అడుగులు వేయాలన్నారు. ఇదే స్ఫూర్తితో గ్రామపంచాయతీలు అభివృద్ధిలో ముందుం చేందుకు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. జడ్పీ చైర్‌పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలు సంపూర్ణ అభివృద్ధి సాధించడం గర్వకారణ మన్నారు. 9 విభాగాల్లో పంచాయతీలు అవార్డులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. నర్సరీలు, డం పింగ్‌యార్డులు, వైకుంఠధామాలు ఏర్పాటు చేశామ న్నారు. జడ్పీ సీఈవో నరేందర్, డీఆర్‌డీవో శేషాద్రి, డీపీవో వెంకటేశ్వర్‌రావు, జడ్పీ వైస్‌చైర్మన్ సత్యనారా యణ, పంచాయతీ అధికారులు ఫణీందర్‌రావు, ప్రభాకర్‌రావు, అధికారులు పాల్గొన్నారు.