భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు స్వామి వివేకానంద

ABN , First Publish Date - 2023-01-13T01:07:31+05:30 IST

భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దశదిశలా చాటి, భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసిన మహానీయులు స్వామి వివేకానంద అని రాష్ట్ర అటవీ, పర్యాటక, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

భారతదేశ  ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు స్వామి వివేకానంద
వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మంత్రి అల్లోల

వివేకానంద కూడలిని అద్భుతంగా తీర్చిదిద్దుతాం

రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌ టౌన్‌, జనవరి 12 : భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దశదిశలా చాటి, భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసిన మహానీయులు స్వామి వివేకానంద అని రాష్ట్ర అటవీ, పర్యాటక, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా నిర్మల్‌ జిల్లాకేంద్రంలోని వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పిం చారు. రానున్న రోజుల్లో నిర్మల్‌ నడి ఒడ్డున ఉన్న స్వామి వివేకానంద విగ్రహం వద్ద కూడలిని బ్రహ్మాండగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌బోర్కడే, మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ఈశ్వర్‌, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ రాజేందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిలుక రమణ, వైస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌ యాదవ్‌, కౌన్సిర్లు అడపా విజయలక్ష్మి పోశెట్టి, లక్కాకుల నరహరి, గండ్రత్‌ రమణ, నరేందర్‌, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.

వివేకానంద జయంతిని ప్రతీసంవత్సరం అధికారికంగా నిర్వహించాలని, జిల్లా వ్యాప్తంగా యువజన దినోత్సవాలను చేపట్టాలని నిర్మల్‌ వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు కూన రమేష్‌ అన్నారు. గురువారం స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

బీజేవైఎం యంగ్‌ ఇండి యా రన్‌

స్వామివివేకానంద 160వ జయంతి సందర్భంగా బీజేవైఎం యంగ్‌ ఇండియారన్‌ చేపట్టారు. గురువారం నిర్మల్‌ జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయం నుండి వివేకానంద చౌక్‌ వరకు బీజేవైఎం నిర్మల్‌ జిల్లా అధ్యక్షులు ఒడిసెల అర్జున్‌ ఆధ్వర్యంలో యంగ్‌ ఇండియా రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివేకానందుడి విగ్రహం దగ్గరికి చేరుకొని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

వివేకానందుడి బోధనలు యువతకు స్ఫూర్తిదాయకం

నిర్మల్‌ కల్చరల్‌, జనవరి 12 : స్వామి వివేకానందుడి బోధనలతో యువత స్ఫూర్తి పొంది వాటిని పాటించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. గురు వారం జిల్లాకేంద్రంలోని పలు విద్యాసంస్థల్లో వివేకానంద జన్మదినోత్సవం సంద ర్భంగా జాతీయ యువజనోత్సవాన్ని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సోఫీనగర్‌ గురుకుల విద్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ గంగాశంకర్‌, సంస్కృత భాషా ప్రచారసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బి.వెంకట్‌ మాట్లాడుతూ... వివేకా నందుడు సనాతన ధర్మానికి, సంస్కృతికి కేంద్రబిందువని అన్నారు. విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-01-13T01:07:58+05:30 IST