తెలంగాణ కోసం పరితపించిన మహనీయుడు జయశంకర్‌

ABN , First Publish Date - 2023-06-22T01:42:22+05:30 IST

ప్రొఫెసర్‌ జయశంకర్‌ మాస్టర్‌ తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించి జీవితాన్నే త్యాగం చేశారని అటవీశాఖ మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి అన్నారు.

తెలంగాణ కోసం పరితపించిన మహనీయుడు జయశంకర్‌
ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఐకే రెడ్డి

నిర్మల్‌ కల్చరల్‌, జూన్‌ 21 : ప్రొఫెసర్‌ జయశంకర్‌ మాస్టర్‌ తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించి జీవితాన్నే త్యాగం చేశారని అటవీశాఖ మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఇంద్రకరణ్‌రెడ్డి నివాళు లర్పించారు. సీఎం కేసీఆర్‌ ఆయన కలలు నిజం చేశారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు జయశంకర్‌ ఆశయాలని వాటిని సాధించిన ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. ఊపిరి ఉన్నంత వరకు స్వరాష్ట్ర సాధనకు ఉద్యమించారని కొనియాడారు. ఆయన జ్ఞాపకాలు స్మరించుకున్నారు. చైర్మన్‌ ఈశ్వర్‌, విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు మఽధుసూదన్‌, కోటరిగి అశోక్‌, ఆకోజి కిషన్‌, తది తరులు పాల్గొన్నారు.

జయశంకర్‌కు విశ్వబ్రాహ్మణుల నివాళి

తెలంగాణ ఉద్యమకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి పురస్కరించుకొని బుధవారం నిర్మల్‌లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నిర్మల్‌ జిల్లా విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ సంఘం ఘన నివాళులర్పించింది. సంఘ నాయకులు ఆకోజి కిషన్‌, డి. శంకర్‌, గాంధారి ప్రభాకర్‌, కే.నరసింహచారి, ఎర్రోజు నర సింహచారి, టి.లక్ష్మణాచారి, తదితరులు పాల్గొన్నారు. జయశంకర్‌ త్యాగాలను స్మరించుకున్నారు.

Updated Date - 2023-06-22T01:42:22+05:30 IST