Share News

Kumaram Bheem Asifabad: ట్రైనీ బీట్‌ అధికారుల క్షేత్ర పర్యటన

ABN , Publish Date - Dec 16 , 2023 | 10:31 PM

బెజ్జూరు, డిసెంబరు 16: మండలంలోని అటవీప్రాంతంలో శనివారం హైదరా బాద్‌ దూలపల్లి ఫారెస్టు అకాడమిలో శిక్షణ పొందుతున్న 34మంది బీట్‌ అధికా రులు పర్యటించారు.

Kumaram Bheem Asifabad:  ట్రైనీ బీట్‌ అధికారుల క్షేత్ర పర్యటన

బెజ్జూరు, డిసెంబరు 16: మండలంలోని అటవీప్రాంతంలో శనివారం హైదరా బాద్‌ దూలపల్లి ఫారెస్టు అకాడమిలో శిక్షణ పొందుతున్న 34మంది బీట్‌ అధికా రులు పర్యటించారు. అకాడమీ అసిస్టెంట్‌ కోర్సు డైరెక్టర్‌ రామ్మో హన్‌ ఆధ్వర్యంలో బెజ్జూరురేంజ్‌ పరిధిలోని కుశ్నపల్లి సెక్షన్‌ పరిధిలోని ఇందూర్‌గాం అటవీప్రాంతాన్ని సందర్శించారు. ఇక్కడి అటవీవిశిష్టతను తెలుసుకున్నారు. ఇక్కడి అడవిలోని వన్య ప్రాణులు, జీవవైవిధ్యం, అరుదైన పక్షుల వివరాలను అటవీ అధికారులు వారికి తెలియజేశారు. కార్యక్రమంలో రేంజ్‌ అధికారి దయాకర్‌, డిప్యూటీరేంజ్‌ అధికారి శ్రావణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2023 | 10:31 PM