Share News

Kumaram Bheem Asifabad: గంగాపూర్‌ రైల్వేగేటుతో తంటాలు

ABN , First Publish Date - 2023-11-18T22:33:56+05:30 IST

రెబ్బెన, నవంబరు 18: గంగాపూర్‌ వెళ్లేదారిలో ఉన్న రైల్వేగే టుతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఈమార్గం గుండా నిత్యం వందలాది ఆటోలు, ద్విచక్ర వాహనాలు వెళ్తుంటాయి. తరు చూ గేటు పడుతుండటంతో గంటలకొద్ది ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

 Kumaram Bheem Asifabad: గంగాపూర్‌ రైల్వేగేటుతో తంటాలు

రెబ్బెన, నవంబరు 18: గంగాపూర్‌ వెళ్లేదారిలో ఉన్న రైల్వేగే టుతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఈమార్గం గుండా నిత్యం వందలాది ఆటోలు, ద్విచక్ర వాహనాలు వెళ్తుంటాయి. తరు చూ గేటు పడుతుండటంతో గంటలకొద్ది ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో చాలా ఇబ్బం ది పడుతున్నామని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఈమార్గం గుండా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులది మరోపరిస్థితి. నిత్యం పాఠశాలకు ఆలస్యమవుతు న్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క సమయంలో మూడు రైళ్లు పోయేవరకు వేచి ఉండాలని పరిస్థితి ఉంటోంది. అలాగే రైల్వే గేటు వేస్తున్న సమయంలో కూడా మధ్యలో ద్విచక్ర వాహనాలుంటున్నాయని పలువురు పేర్కొంటు న్నారు. కొంతమంది గేటువేసే ఉద్యోగులు అత్యు త్సాహం ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. తమకు ఈ సమస్య తీరిపోవాలంటే రైల్వేఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్థులంతా కోరుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే ఆర్వోబీ నిర్మించి తమ సమస్యనుపరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2023-11-18T22:33:58+05:30 IST