Kumaram Bheem Asifabad: పెరిగిన చలి తీవ్రత
ABN , Publish Date - Dec 13 , 2023 | 10:22 PM
బెజ్జూరు, డిసెంబరు 13: తుఫాన్ ఎఫెక్ట్‌తో నాలుగు రోజులుగా మండలంలో చలితీవ్రత పెరిగింది. చల్లని గాలులు వీస్తున్న కారణంగా చలికి జనం తట్టుకోలేక పోతున్నారు. చలిబారి నుంచి రక్షించుకునేందుకు గ్రామాల్లో రాత్రిళ్లు నెగళ్లు కాగుతున్నారు.
బెజ్జూరు, డిసెంబరు 13: తుఫాన్ ఎఫెక్ట్‌తో నాలుగు రోజులుగా మండలంలో చలితీవ్రత పెరిగింది. చల్లని గాలులు వీస్తున్న కారణంగా చలికి జనం తట్టుకోలేక పోతున్నారు. చలిబారి నుంచి రక్షించుకునేందుకు గ్రామాల్లో రాత్రిళ్లు నెగళ్లు కాగుతున్నారు. ముఖ్యంగా చలి కారణంగా చిన్నారులు, వృద్ధులు గజగజ వణుకుతున్నారు. రాత్రి పూట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయి చలిగాలులు వీస్తున్నా యి. ఉదయం 11దాటినా చలితీవ్రత తగ్గక పోవ డంతో పనులకు వెళ్లే రైతులు, కూలీలు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.