Share News

Kumaram Bheem Asifabad: భక్తుల కొంగుబంగారం ‘టోంకిని’ సిద్ధిహనుమాన్‌ ఆలయం

ABN , First Publish Date - 2023-11-20T22:24:07+05:30 IST

సిర్పూర్‌(టి), నవంబరు 20: కాగజ్‌నగర్‌ పట్టణంనుంచి సిర్పూర్‌(టి) మండలంలోని టోంకిని సిద్ధి హనుమాన్‌ ఆలయం వరకు భక్తులు నవంబరు 21 చేపట్టనున్న 22వ మహాపాదయాత్రకు అన్నిఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

 Kumaram Bheem Asifabad:  భక్తుల కొంగుబంగారం ‘టోంకిని’ సిద్ధిహనుమాన్‌ ఆలయం

- నేడు 22వ మహాపాదయాత్ర

- బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ

సిర్పూర్‌(టి), నవంబరు 20: కాగజ్‌నగర్‌ పట్టణంనుంచి సిర్పూర్‌(టి) మండలంలోని టోంకిని సిద్ధి హనుమాన్‌ ఆలయం వరకు భక్తులు నవంబరు 21 చేపట్టనున్న 22వ మహాపాదయాత్రకు అన్నిఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కార్తీకమాసంలో ప్రతిసంవత్స రం జాతరతోపాటు కాగజ్‌నగర్‌ పట్టణం నుంచిమహాపాదయాత్ర నిర్వహిస్తుంటారు. పాదయాత్రగావచ్చిన భక్తుల కొరకు ఉచిత అన్నదానం, తీర్థప్రసాదాల పంపిణీకి ఏర్పా ట్లు చేస్తున్నారు. ఈ సంవత్సరం పాదయ్రా తకు ఆలయ కమిటీతోపాటు సిర్పూర్‌(టి), కాగజ్‌నగర్‌, కౌటాల, తదితర ప్రాంతాల్లోని వ్యాపారస్థులు, రాజకీయపార్టీల ప్రతినిధు లు, స్వచ్ఛంద సేవాసంస్థల ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు పూర్తిచేశారు. భక్తులు పాదయాత్రగా వచ్చేదారిలో తాగునీరు, పాలు, పండ్లు, ఫలహారాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.ఈసారి 30వేలకుపైగా భక్తులు వచ్చేఅవకాశం ఉన్నట్లు ఆలయ కమిటీసభ్యులు అంచనా వేస్తున్నారు. కాగా ఏర్పా ట్లను కాగజ్‌నగర్‌డీఎస్పీ కరుణాకర్‌, కౌటాల సీఐసాదిక్‌పాషా, సిర్పూర్‌(టి)ఎస్సై దీకొండరమేష్‌ పరిశీలించారు. ఆలయపరిస రాలు, సమీపంలోని పెన్‌గంగానది తీరాన చేపట్టాల్సిన బందోబస్తు చర్యల గురించి చర్చించారు. ఆలయంలోని స్వామివారిని దర్శించుకుని ముడుపులు కడితే కోరిన కోరి కలు తీరుతాయని భక్తుల అపారన మ్మకం. దీంతో భక్తులు ప్రతియేటా ఆలయానికి పాదయాత్రగా వచ్చి మొక్కులు చెల్లించు కుంటారు.

భక్తుల పాదయాత్ర

కెరమెరి: టోంకిని సిద్ధిహనుమాన్‌ ఆల యానికి సోమవారం భక్తులు పాదయాత్ర చేపట్టారు. మంగళవారంకాగజ్‌నగర్‌ నుంచి మహాపాదయాత్ర ఉండడంతో ఒక్కరోజు ముందుగానే కెరమెరి మండలంలోని గోయ గాం గ్రామానికి చెందిన యువకులు పాద యాత్రగా తరలివెళ్లారు. మహిళలు వారిని గ్రామ పొలిమేర వరకు మంగళహారతితో సాగనంపారు.

వాంకిడి: మండలంలోని ఖిరిడి గ్రామా నికి చెందిన యువతీ, యువకులు కూడా పాదయాత్రగాతరలివెళ్లారు. గ్రామంలోని ఆంజనేయస్వామిఆలయంలో పూజలు నిర్వ హించి భాజాభజంత్రీలతో గ్రామస్థులు వారిని సాగనంపారు.

Updated Date - 2023-11-20T22:24:09+05:30 IST