Kumaram Bheem Asifabad: పాఠశాల పనులను త్వరగా పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2023-07-19T22:10:53+05:30 IST

పెంచికలపేట, జూలై 19: మనఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా చేపడు తున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ రాజు అన్నారు. బుధవారం మండల కేంద్రం లోని జిల్లా పరిషత్‌ పాఠశాలను సందర్శిం చారు.

Kumaram Bheem Asifabad: పాఠశాల పనులను త్వరగా పూర్తిచేయాలి

- విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ రాజు

పెంచికలపేట, జూలై 19: మనఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా చేపడు తున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ రాజు అన్నారు. బుధవారం మండల కేంద్రం లోని జిల్లా పరిషత్‌ పాఠశాలను సందర్శిం చారు. పాఠశాలలో చేపట్టిన పనులను పరిశీలించారు. విద్యార్థులను వసతులు, బోధనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పుస్తకాలు, ఏకరూప దుస్తులు సరిపడ రాలేదని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకురాగా త్వరలోనే అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థుల వసతు లపై ఆరాతీశారు. ప్రహరీ లేకపోవడం ఏమిటని ఎస్‌వో కవితను అడుగగా కలెక్టర్‌ ఆదేశాల అను సారం కొలతలు తీసుకున్నారని త్వరలోనే నిర్మిస్తార న్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

Updated Date - 2023-07-19T22:10:53+05:30 IST