Kumaram Bheem Asifabad: జోనల్‌ స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2023-10-12T22:47:13+05:30 IST

ఆసిఫాబాద్‌ రూరల్‌, అక్టోబరు 12: గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలల్లో చదువుతున్న విద్యార్థు లకు జోనల్‌స్థాయి క్రీడలు సోమవారం జిల్లా కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ ఉపసంచాలకురాలు ఆర్‌ రమాదేవి అధికారులతో కలిసి జెండాఊపి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు.

Kumaram Bheem Asifabad:   జోనల్‌ స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం

ఆసిఫాబాద్‌ రూరల్‌, అక్టోబరు 12: గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలల్లో చదువుతున్న విద్యార్థు లకు జోనల్‌స్థాయి క్రీడలు సోమవారం జిల్లా కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ ఉపసంచాలకురాలు ఆర్‌ రమాదేవి అధికారులతో కలిసి జెండాఊపి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ క్రీడల వికాసానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొని జిల్లాకు వన్నె తీసుకురావాలని ఆకాంక్షించారు. డివిజన్‌ స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడల్లో తలపడుతున్నట్లు తెలిపారు. ఈక్రీడల్లో 765మంది విద్యార్థులు పాల్గొంటున్నారని పేర్కొ న్నారు. కార్యక్రమంలో ఏసీఎంవోలు ఉద్దవ్‌, జగన్‌, ఏటీడీవోలు క్షేత్రయ్య, పురుషోత్తం, కమ్మర్‌హుస్సేన్‌, చిరంజీవి, స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ మీనారెడ్డి, జీవరత్నం, జీసీడీవో శకుంతల, ప్రధానోపాధ్యాయులు కృష్ణారావు, హెచ్‌ఎం శ్రీనివాస్‌, గోపాల్‌, పీడీలు, పీఈటీలు మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-12T22:47:13+05:30 IST