తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు: ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
ABN , First Publish Date - 2023-06-17T22:18:49+05:30 IST
దహెగాం, జూన్ 17: తాగునీటి సమస్య పరి ష్కారానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శనివారం దహెగాం మండలపరిషత్ కార్యాలయంలో ఎం పీపీ సులోచన అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు.
దహెగాం, జూన్ 17: తాగునీటి సమస్య పరి ష్కారానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శనివారం దహెగాం మండలపరిషత్ కార్యాలయంలో ఎం పీపీ సులోచన అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వర్షా కాలంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా చేతిపంపులు ఏర్పాటు చేస్తామన్నా రు. అలాగే కాగజ్‌నగర్ మండలం అందవెల్లి పెద్ద వాగు వద్ద పైపులైన్ కొట్టుకు పోయి నీటిసరఫరాలో అంతరాయం కలిగితే జగన్నాథ్ పూర్ ప్రాజెక్టు నుంచి పైపులైన్ ఏర్పాటు చేసి దహెగాం మండలంతోపాటు కాగజ్‌నగర్ మండలం బోడపల్లి, జగన్నాథ్‌పూర్ గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కా రానికి కృషి చేస్తామన్నారు. అదేవిధంగా వివిధ శాఖల అధికా రులు తమ ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. సమావేశంలో జడ్పీటీసీ శ్రీరామరావు, తహసీల్దార్ ప్రహ్లాద్, వైస్ ఎంపీపీ సురేష్, ఎంపీవో రాజేశ్వర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
దహెగాం: మండల కేంద్రంలోని పలువురు కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చెక్కులను శనివారం పంపిణీ చేశారు. అనంతరం రూ.20లక్షల వ్యయంతో చౌక గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అలాగే పెంచికలపేట-దహెగాం మండలాల మధ్య పెద్ద వాగుపై నిర్మించి అప్రోచ్ రోడ్డు పనులను పరిశీలిం చారు. పనులను వెంటనే పూర్తి చేయా లన్నారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్య లు చేపట్టాలన్నారు. ఆయన వెంట ఎంపీపీ సులో చన, జడ్పీటీసీశ్రీరామరావు, సర్పంచ్‌లు,ఎంపీటీసీలు పాల్గొన్నారు.