విత్తన ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్
ABN , First Publish Date - 2023-06-20T23:14:53+05:30 IST
మార్కెట్లో పెద్ద సంఖ్యలో కంపెనీలు విత్తనాలను ఉత్పత్తి చేస్తున్న తరుణంలో ఏదీ అసలు, ఏది నకిలీవో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోతున్నారు. వానాకాలం పంటల సీజన్ మొదలవడంతో నకిలీ విత్తనాలు రాజ్యమేలు తున్నాయి. అధికారుల తనిఖీల్లో పలు చోట్ల నకిలీ విత్తనాలు పట్టుబ డుతున్నాయి. ఈ నకిలీలకు సాంకేతికతతో చెక్ పెట్టేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. విత్తన కంపెనీలు క్యూఆర్ కోడ్ పరిజ్ఞానం తో అసలు కంపెనీవా, నకిలీవా తెలుసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటు న్నాయి.
- వానాకాలం సీజన్ నుంచే అమలుకు ఆదేశాలు
మార్కెట్లో పెద్ద సంఖ్యలో కంపెనీలు విత్తనాలను ఉత్పత్తి చేస్తున్న తరుణంలో ఏదీ అసలు, ఏది నకిలీవో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోతున్నారు. వానాకాలం పంటల సీజన్ మొదలవడంతో నకిలీ విత్తనాలు రాజ్యమేలు తున్నాయి. అధికారుల తనిఖీల్లో పలు చోట్ల నకిలీ విత్తనాలు పట్టుబ డుతున్నాయి. ఈ నకిలీలకు సాంకేతికతతో చెక్ పెట్టేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. విత్తన కంపెనీలు క్యూఆర్ కోడ్ పరిజ్ఞానం తో అసలు కంపెనీవా, నకిలీవా తెలుసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటు న్నాయి.
ఆసిఫాబాద్ రూరల్, జూన్ 20: విత్తన ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ ఉంటే అసలువేవో.. నకలీవేవో సులువుగా గుర్తించవచ్చు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విత్తన ప్యాకేట్లపై క్యూఆర్ కోడ్ తప్పని సరిగా ముద్రించాలని సీడ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేశాయి. ఈ మేరకు మార్కెట్‌లో రైతులకు విక్రయించే పత్తి విత్తన ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ముద్రించాలని విత్తన కంపెనీలకు కేంద్రం సూచించింది. జిల్లాలోని రెండు నియోజక వర్గాల్లో సాగు చేసే పత్తి, ఇతరరాత్ర విత్తనాలకు ప్రైవేటు కంపెనీలే దిక్కు. ఈ నేపథ్యంలో అమాయక రైతులకు నకిలీ, నాసిరకం విత్తనాలు కట్టబెట్టేందుకు కొంత మంది వ్యాపారులు సిద్ధమయ్యారు. దీన్ని అరికట్టేందుకు క్యూఆర్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
నాలుగు లక్షల ఎకరాల్లో పంటల సాగు..
జిల్లాలో 15 మండలాల్లో వాన కాలంలో నాలుగు లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తారు. ఇందులో ఎక్కువ శాతం పత్తి వేస్తారు. సీజన్ ప్రారంభమైన క్రమంలో పలు రకాల కంపెనీలు తమ విత్తనాలను మార్కెట్‌లోకి విడుదల చేశాయి. ఇందులో నకిలీవి, అసలువి ఏవో తెలియని పరిస్థితి నెలకొంది. కంపెనీలు విక్రయించే విత్తనాల్లోనే ఒక్కో సారి నాసిరకం వస్తున్నాయని దీంతో ఆశించిన స్థాయిలో దిగుబడి ఆవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం విత్తనాలతో రైతులు నష్ట పోయిన సందర్భంలో పలు కారణాలు చెప్పి పరిహారం ఇవ్వడం లేదు. దీంతో నకిలీ విత్తనంతో పాటు నాసిరకం విత్తనాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం విత్తనాల ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ తప్పని సరి చేసింది.
రైతులు రశీదు పొందినప్పటికీ..
రైతులు పత్తి విత్తన డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసి రశీదు పొందినప్పటికీ ఆ విత్తనాలు మొలకెత్తక పోయినా, పంట నష్ట పోయినా గతంలో విత్తన కంపెనీల నుంచి సరైన పరిహారం అందేది కాదు. కొందరు బ్రాండెడ్ కంపెనీల లేబుళ్లు అతికించి రైతులను మోసం చేసేవారు. కానీ ప్రస్తుతం క్యూఆర్ కోడ్ ముద్రించడంతో ఆ విత్తనాలు మొలకెత్తకున్నా.. దిగుబడి సక్రమంగా రాకున్నా.. ఆ విత్తన కంపెనీ నుంచి పరిహారం పొందవచ్చు. వ్యవసాయాధికా రులకు క్యూఆర్ కోడ్ ఉన్న ప్యాకెట్‌ను చూపిస్తే విత్తనం సమగ్ర సమాచారం వస్తుంది. దాని ఆధారంగా కంపెనీ నుంచి పరిహారం అందుతుంది. అయితే రైతులు కొనుగోలు చేసిన పత్తి విత్తనాల ప్యాకెట్, రశీదులను భద్ర పర్చుకోవాలి.
పూర్తి వివరాలు..
కంపెనీలు విక్రయించే విత్తన ప్యాకెట్లపై విత్తనాల లాట్ సంఖ్య, ఎక్కడ పండించారు, వంగడం రకం పేరు, ఎక్కడ శుద్ధి చేశారు, వాటి సాగు కాలపరిమితి, విత్తనాన్ని సర్టిఫైడ్ చేసిన సంస్థ పేరు, చిరునామా, జన్యుపరమైన వివరాలు క్యూఆర్ కోడ్‌లో ఉంటాయి. మార్కెట్‌లో పత్తి, వరి విత్తనాల విక్రయం ఎక్కువగా ఉంటుంది. అయితే అసలు విత్తనాల కన్నా ముందే నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి వచ్చేశాయి. నకిలీ విత్తన సంచులపై లేబుల్ నంబర్, లాట్ నంబర్, విత్తనాలను పరీక్షించిన తేదీ, ప్యాకింగ్ తేదీ, వాలిడిటీ, ఎంఆర్‌పీ ఇవేమి ఉండవు. కొన్ని కంపెనీలు బోగస్ లేబుల్ వేసి నాసిరకం విత్తనాలు విక్రయిస్తున్న ట్లు తెలుస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు క్యూఆర్ కోడ్ తప్పని సరి చేసినట్లు సమాచారం. గతేడాది ప్రభుత్వ రంగ సంస్థలు విక్రయించే విత్తనాలపై క్యూఆర్ కోడ్‌లు ముద్రించగా ఈ సీజన్ నుంచి ప్రైవేటు కంపెనీలు కూడా ప్యాకెట్లపై కోడ్ ఉండేలా చర్యలు తీసుకుం టున్నాయి. కొన్ని పేరు పొందిన కంపెనీలు మాత్రమే క్యూఆర్ కోడ్‌లు ముద్రించి విత్తనాలు విక్రయిస్తున్నా కొన్ని కంపెనీలు కోడ్ లేకుండానే విక్రయిస్తున్నాయి.
క్యూఆర్ కోడ్ ఉంటుంది..
- శ్రీనివాస్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి
కొన్ని కంపెనీలకు చెందిన విత్తన ప్యాకెట్‌పై క్యూఆర్ కోడ్‌లు ఉన్నా యి. మరికొన్నింటికి లేవు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విత్తనాల ప్యాకెట్లకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీంతో రైతులు నష్ట పోయే ఇబ్బంది ఉండదు. రైతులు విత్తనాలు కొనుగోలు సమయంలో రశీదు తీసుకుని భద్ర పర్చుకోవాలి.