ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2023-04-21T00:37:21+05:30 IST

ఈ ఏడాది యాసంగిలో జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభు త్వం రంగం సిద్ధం చేసింది.

ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధం
లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్‌ గ్రామ కొనుగోలు కేంద్రంలో పేరుకుపోయిన ధాన్యం కుప్పలు

ఈ ఏడాది యాసంగి లక్ష్యం 1.70 లక్షల మెట్రిక్‌ టన్నులు

ఫనేడు లోకేశ్వరం మండలం రాజురలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి) : ఈ ఏడాది యాసంగిలో జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభు త్వం రంగం సిద్ధం చేసింది. రైతన్న పండించిన పంట దళారులకు విక్ర యించి మోసపోవద్దని ప్రధాన సంకల్పంతో ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా నిర్మల్‌ జిల్లాలో సైతం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు ప్రభుత్వ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. శుక్రవారం జిల్లాలోని లోకేశ్వరం మండలంలో గల రాజుర గ్రామంలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్లు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.

Updated Date - 2023-04-21T00:37:21+05:30 IST