తెలుగు వారికి ప్రత్యేకం ఉగాది

ABN , First Publish Date - 2023-03-23T01:55:06+05:30 IST

చర సాంప్రదాయాలను పాటిస్తూ జరుపుకునే తొలి పండుగ ఉగాది తెలుగువారికి ప్రత్యేకమైనదని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు.

తెలుగు వారికి ప్రత్యేకం ఉగాది
ఆదిలాబాద్‌లో ఉగాది పచ్చడిని పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే జోగు రామన్న

ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు

జిల్లావ్యాప్తంగా పంచాంగ శ్రవణం

ఆదిలాబాద్‌, మార్చి 22(ఆంధ్రజ్యోతి): ఆచర సాంప్రదాయాలను పాటిస్తూ జరుపుకునే తొలి పండుగ ఉగాది తెలుగువారికి ప్రత్యేకమైనదని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బుధవారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలో ని శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఉగాది పచ్చళ్లను అందించారు. ముందుగా స్వామి వివేకానంద విగ్ర హానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పేరుకు తగ్గట్లే ఈ యేడాది శోభాయమానంగా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చె బుతుందని తెలిపారు. వర్షాలు భాగా కురిసి రైతులకు అధిక దిగుబడులు రావాలని ఆకాంక్షించారు. ఉగాది పండుగకు ఎంతో విశిష్టమైన ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఉగాది పచ్చడితో ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు. ఇందులో డీసీసీబీ చైర్మన్‌ అడ్డిభోజారెడ్డి, సేవా సమితి అధ్యక్షులు ఆరే.భూమన్న, ప్రధాన కార్యదర్శి కోరెడ్డి లెనిన్‌, లస్మయ్య, హన్మాండ్లు, కోటేశ్వర్‌రావు, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే, పట్టణంలోని గోపాలకృష్ణ మఠంలో ఎమ్మెల్యే రామన్న ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. కాగా, శోభాకృత్‌ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ప్రసిద్ధి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు భాజభజంత్రిలతో ఘన స్వాగతం పలికారు.

దక్షిణముఖి ఆలయంలో పంచాంగ శ్రవణం

శోభకృత్‌ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్‌ పట్టణంలోని కైలాస్‌నగర్‌ దక్షిణముఖి హనుమాన్‌ ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించా రు. ప్రముఖ పురోహితులు పంచాంగ కర్త చిక్కిలి వెంకటేశ్వర శాస్ర్తీ సిద్ధాంతి రా శుల వారీగా పంచాంగం చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు. పంచాంగ కర్త వివరించిన పంచాంగ శ్రవణాన్ని శ్రద్ధగా విన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేకు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే పట్టణంలోని మంగమఠం ఆలయంలో ఉగాది పం డుగ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నా రు. ఆ తర్వాత ఉగాది పచ్చడిని స్వీకరించారు.

ఉట్నూర్‌: శ్రీశోభకృత్‌ నామ సంవత్సర పర్వదినాన్ని పురస్కరించుకోని హిం దువులు బుధవారం ఉగాది పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. స్థానిక ఐబి చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హజరైన మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌ ఉగాది పచ్చడి పంపిణీ చేసిన అనం తరం మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలందరు సుఖసంతోషాలతో జీ వించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు శ్రీరాంనాయక్‌, జిల్లా కార్యదర్శి కోండేరి రమేష్‌, మండల అధ్యక్షుడు కొలిపాక రాజశేఖర్‌, జిల్లా నాయకులు శేషారావు, కొమ్మురాంచందర్‌, ఉస్కమల్ల దేవిదాస్‌, ఉగ్గే విజయ్‌, మెస్రం బాగ్యలక్ష్మి, సీపతి లింగాగౌడ్‌, భూపతి, కాల్వరవి, చింతల రమణ, మధుకర్‌, సత్తన్న, పర్శురాం యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే, స్థానిక హరిహార క్షేత్రం అయ్యప్ప ఆలయం, హన్మాన్‌ మందిరంలో పంచాంగ శ్రవణం చేశారు. మండలంలోని గ్రామీణ ప్రాంతాలలో రైతులు పంట భూముల్లో పూజలు నిర్వహించారు. అలాగే, లక్కారంలో శాలివాహాన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్థన్‌ ప్రా రంభించారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగేందర్‌, సర్పంచ్‌ జనార్థన్‌ రాథోడ్‌, మాజీ సర్పంచ్‌ మర్సుకోల తిరుపతి, జాదవ్‌ సుమన్‌బాయి, తదితరులు పాల్గొన్నారు.

నేరడిగొండ: శోభకృత్‌ ఉగాది పర్వదిన సందర్భంగా మండలంలోని కుప్టి గ్రామంలో ఎంపీపీ రాథోడ్‌సజన్‌, బోథ్‌మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రుక్మన్‌సింగ్‌లు సామాజిక కార్యకర్త కొయ్యడిగంగయ్య పిలుపు మేరకు హాజరై ఉగాది సంబరాల్లో పాల్గొన్నారు. ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఇందులో సర్పంచ్‌ రాజు, విశాల్‌, జంగు డైరెక్టర్‌ కుంట కిరణ్‌కుమార్‌రెడ్డి, భీమ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, భోజన్న, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తలమడుగు: తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను బుధవారం మండ లంలో ఘనంగా నిర్వహించుకున్నారు. రైతులు తమ వేసే పనులకు శ్రీకారం చుట్టారు. ఉదయం నాలుగు గంటలకు వెళ్లి తమ వ్యవసాయ భూములకు వెళ్లి పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఇందులో వేంకటేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీకాంత్‌, వేద పండితులు కళ్యాణ్‌ కుమార్‌, సర్పంచ్‌ కరుణాకర్‌రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-23T01:55:06+05:30 IST