తాగునీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్థులు

ABN , First Publish Date - 2023-06-19T01:50:26+05:30 IST

మండలంలోని సూర్యనగర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని సాకెర, సూర్యనగర్‌ గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు తాగు నీటి కోసం రోడ్డెక్కారు.

తాగునీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్థులు
నేరడిగొండ(జి)లో గ్రామస్థులతో కలిసి ధర్నా చేస్తున్న సర్పంచ్‌

బోథ్‌, జూన్‌ 18: మండలంలోని సూర్యనగర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని సాకెర, సూర్యనగర్‌ గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు తాగు నీటి కోసం రోడ్డెక్కారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రమం తా ప్రజలు మంచినీటి పండుగ చేసుకుంటుంటే.. సూర్యనగర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలు మాత్రం తాగునీటి సమస్యను పరిష్క రించాలని కోరుతూ ఆదివారం మండలంలోని సూర్యనగర్‌ రోడ్డుపై బైఠా యించారు. అన్న తినడం సైతం లెక్క చేయకుండా గ్రామస్థులు ఖాళీ బిందెలతో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మీరా బాయి మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల క్రితం గ్రామంలో పైప్‌లైన్‌ అక్కడ వేశారని, పాత పైప్‌లైన్‌కి కనెక్షన్‌ను ఇవ్వడం జరిగిందని, పాత పైప్‌లైన్‌లో బురద కూరుకుపోవడంతో నీరు రావడం లేదని ఆమె వాపో యారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆమె వాపోయారు. జిల్లా కలెక్టర్‌ స్పందించి గ్రామంలో నాలుగేళ్లుగా ఉన్న నీటి సమస్యను పరిష్కరించాలని ఆమె కోరారు.

నేరడిగొండ(జి)లో ఖాళీ బిందెలతో నిరసన

సిరికొండ: మండలంలోని నేరడిగొండ(జి) గ్రామ పంచాయతీలో మంచినీటి దినోత్సవం రోజే గ్రామస్థులతో కలిసి సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లు ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎంతో ప్రతీష్టాత్మకంగా మిషన్‌ భగీరథ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మంచినీటి దినోత్సవం రోజే నేరడిగొండ(జి) గ్రామ పంచాయతీలోని నేరడిగొండ(కే), చిన్నగొదుమల్లెలో గ్రామస్థులతో కలిసి సర్పంచ్‌ అర్క జగన్‌, ఉపసర్పంచ్‌ రూపబాయి కృష్ణలు మంచినీటి దినోత్సవాన్ని బహిష్కరించి, రోడ్డుపై ఖాళీ బిందెలతో నిరసనకు దిగడం సంచలనంగా మారింది. కాగా, ఈ ఉత్సవాలను నిర్వహించడానికి పంచా యతీ కార్యదర్శిని సైతం తమ గ్రామాల్లోకి గిరిజనులు రానివ్వలేదు. అధి కారులు అలంకారప్రాయంగా పాత నీటి ట్యాంకులకు మిషన్‌ భగీరథ పేరుతో రంగులు వేశారన్నారు. ఇప్పటికీ తమ గ్రామాల్లో పైపులైన్‌తో పాటు ఇంటింటికీ నల్లాలు బిగించలేదని వాపోయారు. కొన్ని ఇళ్లల్లో నల్లాలు బిగించినా.. నీటి సరాఫరా జరగడం లేదని వాపోయారు. తీవ్ర మైన ఎండల దృష్ట్యా తమ గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి చేతి పంపుల్లో నీరు రాక గంటల తరబడి ఎండలో నిరీక్షిస్తూ తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఆవేదనను వ్యక్తం చేశ రు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి మిషన్‌ భగీ రథ నీటిని అందించాలని గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - 2023-06-19T01:50:26+05:30 IST