Share News

ప్రజా దర్బార్‌తో సమస్యలు పరిష్కరిస్తాం

ABN , First Publish Date - 2023-12-10T22:13:42+05:30 IST

రానున్న రోజుల్లో బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రజా దర్బార్‌ కార్యక్ర మాన్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరి ష్కరిస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. ఆది వారం బెల్లంపల్లిలో విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు, ప్రజాప్ర తినిధుల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధా లుగా అభివృద్ధి చేస్తానన్నారు.

ప్రజా దర్బార్‌తో సమస్యలు పరిష్కరిస్తాం

బెల్లంపల్లి, డిసెంబరు 10: రానున్న రోజుల్లో బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రజా దర్బార్‌ కార్యక్ర మాన్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరి ష్కరిస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. ఆది వారం బెల్లంపల్లిలో విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు, ప్రజాప్ర తినిధుల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధా లుగా అభివృద్ధి చేస్తానన్నారు. బెల్లంపల్లి ప్రజలకు గోదావరి నీటిని అందించేందుకు కృషి చేస్తానని, స్ధానికంగా ఉంటూ సమస్యలను పరిష్కరిస్తాన న్నారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుని భూములను స్వాధీనం చేసుకుం టామని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎంతో నమ్మకంతో ప్రజలు గెలిపించారని, ఎల్లవేళలా ప్రజలకు అందు బాటులో ఉంటానని, నియోజకవర్గాన్ని అన్ని రంగా ల్లో అభివృద్ధి చేస్తానన్నారు. ఎన్నికల సమయంలో గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలందరికి అండగా ఉంటానని, కలిసికట్టుగా ముందుకు వెళ్తామని సూ చించారు. ఆయా శాఖల అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారని, మున్సిపల్‌ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత, నాయకులు బండి ప్రభాకర్‌, కారుకూరి రాంచందర్‌, రాములు నాయక్‌, నాతరి స్వామిలు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T22:13:44+05:30 IST