మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా సాగాలి: ఎస్పీ సురేష్‌కుమార్‌

ABN , First Publish Date - 2023-04-08T21:48:41+05:30 IST

తిర్యాణి, ఏప్రిల్‌ 8: మహిళలు ఆర్థిక స్వావలం బన దిశగా సాగాలని ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు. శని వారం మండల కేంద్రంలో వసుధ స్వచ్ఛంద సంస్థ ఆర్థికసహాయంతో ఏర్పాటుచేసిన కుట్టు మిష న్‌ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వసుధ స్వచ్ఛంద సంస్థ అందజేస్తున్న ఈ అవకా శాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా సాగాలి: ఎస్పీ సురేష్‌కుమార్‌

తిర్యాణి, ఏప్రిల్‌ 8: మహిళలు ఆర్థిక స్వావలం బన దిశగా సాగాలని ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు. శని వారం మండల కేంద్రంలో వసుధ స్వచ్ఛంద సంస్థ ఆర్థికసహాయంతో ఏర్పాటుచేసిన కుట్టు మిష న్‌ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వసుధ స్వచ్ఛంద సంస్థ అందజేస్తున్న ఈ అవకా శాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి మహిళా స్వయం ఉపాధి పొంది, ఆర్థికంగా తనకాళ్లపై తాను నిలబడాలని అన్నారు. అనంతరం కుట్టు మిషన్లను, టైలరింగ్‌ సర్టిఫికేట్లు అందించారు. కార్యక్రమంలో సంస్థ కోఆర్డినేటర్‌ ఉమ, శిక్షకురాలు రమాదేవి, ఏఎస్పీ అచ్చేశ్వర్‌రావు, డీఎస్పీలు శ్రీని వాస్‌, సీఐనరేందర్‌, ఎస్సై రమేష్‌, సర్పంచ్‌ సింధుజ, గుణవంతరావు పాల్గొన్నారు.

పటిష్ట బందోబస్తు మధ్య ‘పది’ పరీక్షలు

పదవ తరగతి పరీక్షలు పటిష్ట బందోబస్తు మధ్య జరుగుతున్నట్లు ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు. శని వారం తిర్యాణి మండలం కేంద్రం లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల కేంద్రంను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష నిర్వ హణ గురించి సంబంధిత అధికారిని అడిగి తెలుసుకున్నారు. పరీక్ష నిర్వహణ సిబ్బంది, పోలీసు సిబ్బందికి మొబైల్‌ ఫోన్‌లు అనుమతి లేవన్నారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున ఏ సమస్య ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజే యాలని పరీక్ష నిర్వహణ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ నరేందర్‌, ఎస్సై రమేష్‌ ఉన్నారు.

Updated Date - 2023-04-08T21:48:41+05:30 IST