రోడ్డుపై గుంతలు పూడ్చిన యువకులు
ABN , Publish Date - Dec 26 , 2023 | 09:43 PM
సోమగూడం నుంచి కాసిపేట వెళ్లే ప్రధాన రహదారిపై గుంతలు పడి ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతు న్నారు. ఇది గమనించిన దుబ్బగూడెం వార్డు సభ్యురాలు గోనెల శ్రీలత శ్రీనివాస్ చొరవతో యువకులందరు మంగళవారం శ్రమదానం చేశారు.
కాసిపేట, డిసెంబరు 26 : సోమగూడం నుంచి కాసిపేట వెళ్లే ప్రధాన రహదారిపై గుంతలు పడి ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతు న్నారు. ఇది గమనించిన దుబ్బగూడెం వార్డు సభ్యురాలు గోనెల శ్రీలత శ్రీనివాస్ చొరవతో యువకులందరు మంగళవారం శ్రమదానం చేశారు. రోడ్డుపై ఉన్న గుంతలను మట్టితో పూడ్చివేశారు. స్ధానిక యువకుడు గోనెల శ్రీనివాస్ మాట్లాడుతూ సోమగూడెం టోల్‌గేట్ నుంచి కాసిపేటకు వెళ్లే రహదారిపై ఏర్పడిన గుంతలతో కార్మికులు, ద్విచక్ర వాహనదారులు గుంతల్లో పడి గాయాలపాలవుతున్నారు. వారం రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులు కింద పడి గాయాలపాలయ్యారన్నారు. దీంతో శ్రమదానం చేసి సొంత ఖర్చులతో రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చినట్లు తెలిపారు. దీంతో యువకులను పలువురు అభినందించారు.