Share News

Telangana Elections: నిజామాబాద్‌లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు మొదలు

ABN , First Publish Date - 2023-11-29T09:24:40+05:30 IST

Telangana Elections: జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాలకు ఎన్నికల సిబ్బంది తరలుతున్నారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్ల పరిధిలో 833 ప్రాంతాలలో 1549 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు.

Telangana Elections: నిజామాబాద్‌లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు మొదలు

నిజామాబాద్: జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాలకు ఎన్నికల సిబ్బంది తరలుతున్నారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్ల పరిధిలో 833 ప్రాంతాలలో 1549 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 13,94,986 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లలో 80 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లు 17,393 మంది ఉండగా, 40 శాతం పైబడి వైకల్యం కలిగిన దివ్యంగులు 23,919 మంది ఉన్నారు. 18 - 19 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన యువ ఓటర్లు 47,636 మంది ఉన్నారు.

జిల్లాలో 2248 మంది తమ ఇంటి వద్ద నుంచే ఓటు హక్కేను వినియోంచుకున్నారు. ఎన్నికల విధుల్లో 7,215 సిబ్బంది పాల్గొంటున్నారు. ఆరు సెగ్మెంట్ల పరిధిలో 77 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్లో 21 మంది.. రెండు బ్యాలెట్ యూనిట్ల వినియోగం జరుగనుంది. పోలింగ్ నిర్వహణ కోసం పీఓలు 1864 మంది, ఏపీఓలు 1867, ఓపీఓలు 3727లు కలుపుకుని మొత్తం 7458 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 3,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. 107 మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-29T09:24:41+05:30 IST