CPM: ఈ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి .. ఏయే స్థానాల్లో పోటీ చేయబోతోందంటే..?
ABN , First Publish Date - 2023-11-05T10:40:27+05:30 IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో సీపీఎం పార్టీ ( CPM Party ) పోటీ చేయనుంది. ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ చేసే 14 స్థానాలకు సీపీఎం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో సీపీఎం పార్టీ ( CPM Party ) పోటీ చేయనుంది. ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ చేసే 14 స్థానాలకు సీపీఎం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మరో 3స్థానాలకు రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం సీపీఎం పార్టీ సిద్ధమైంది. కానీ కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయం చెప్పకపోవడంతో సీపీఎం పార్టీ ఒంటరిగానే పోటీచేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈమేరకు అభ్యర్థులను ప్రకటించింది. సీట్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోకపోవడంతోనే ఒంటరిగా పోటీ చేస్తున్నామని సీపీఎం పార్టీ రాష్ట్ర నేత తమ్మినేని వీరభద్రం తెలిపారు. సీపీఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కోసం ఇన్ని రోజులు వేచి చూశాం. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఇందులో భాగంగానే ఒంటరిగా బరిలోకి దిగేందుకు నిర్ణయించాం. కాంగ్రెస్ పార్టీ వామపక్షాలకు చెరొక స్థానంతో పాటు ఎమ్మెల్సీ ఇస్తాం అన్నారు. సీపీఎం మేనిఫెస్టో కూడా విడుదల చేస్తున్నాం. నల్గొండ.. కోదాడ, హుజుర్‌నగర్‌లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు త్వరలో ప్రకటిస్తాం. కొత్తగూడంలో సీపీఐ పోటీ చేస్తోంది. అక్కడ సీపీఐకి మద్దతు ఇస్తాం. సీపీఐ పోటీ చేసే చోట మేము మద్దతు ఇస్తాం’’ అని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం తెలిపారు.
సీపీఎం ప్రకటించిన అభ్యర్థులు వీరే..
1.పాలేరు - తమ్మినేని వీరభద్రం
2.భద్రాచలం - కారం కుల్లయ్య
3.అశ్వారావుపేట - పిట్టల అర్జున్
4.మధిర - పాలడుగు భాస్కర్
5.వైరా - భూక్యా వీరభద్రం
6.ఖమ్మం - ఎర్ర శ్రీకాంత్
7.సత్తుపల్లి - మాచర్ల భారతి
8.మిర్యాలగూడ - జూలకంటి రంగారెడ్డి
9.నకిరేకల్ - బొజ్జ చిన్న వెంకులు
10.భువనగిరి - నరసింహా
11.జనగాం - మక్కు కనకరెడ్డి
12.ఇబ్రహీంపట్నం - పగడాల యాదయ్య
13.పటాన్ చెరు - మల్లికార్జున్
14.ముషీరాబాద్ - దశరథ్