Share News

DGP Anjani Kumar: ప్రజలందరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోండి

ABN , First Publish Date - 2023-11-30T08:02:19+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. ఓటు అనే ఆయుధం ద్వారా మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉందన్నారు.

DGP Anjani Kumar:  ప్రజలందరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోండి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. ఓటు అనే ఆయుధం ద్వారా మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 70 వేల మంది పోలీస్ సిబ్బంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి హోంగార్డ్ సిబ్బంది, కేంద్ర బలగాలతో బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నానన్నారు. తాను.. తన భార్య ఇద్దరం ఓటు హక్కును వినియోగించుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూర ఓటు హక్కును వినియోగించుకోవాలని అంజనీ కుమార్ కోరారు.

Updated Date - 2023-11-30T08:02:20+05:30 IST