Telangana Elections: భద్రాద్రి కొత్తగూడెంలో గంట ముందే ముగిసిన ఎన్నికల ప్రచారం
ABN , First Publish Date - 2023-11-28T16:17:40+05:30 IST
Telangana Elections: జిల్లాలో గతకొద్దిరోజులుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రచారం ముగిసింది. నాలుగు గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్ అవగా.. 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. ఈనెల 30న ఉదయం 7 గంటల నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో గతకొద్దిరోజులుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి (Election Campaign) తెరపడింది. ఈరోజు (మంగళవారం) సాయంత్రం నాలుగు గంటలకు ప్రచారం ముగిసింది. నాలుగు గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్ అవగా.. 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. ఈనెల 30న ఉదయం 7 గంటల నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కావడంతో జిల్లాలో గంట ముందుగానే పోలింగ్ ముగియనుంది. జిల్లాలో మొత్తం ఐదు నియోజకవర్గాల్లో 9,66,439 మంది ఓటర్లు ఉన్నారు. 1098 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 320 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. మొత్తం 95 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో, కొత్తగూడెంలో సీపీఐ పోటీలో ఉంది. బీజేపీ, జనసేన కూటమి నేపథ్యంలో బీజేపీ మూడు స్థానాల్లో, జనసేన రెండు స్థానాల్లో పోటీకి దిగింది.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి