TS Elections: 30న ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ఇవ్వాల్సిందే.. లేదంటే చర్యలు తప్పవు
ABN , First Publish Date - 2023-11-28T16:45:06+05:30 IST
ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు సూచించారు.
హైదరాబాద్: ఈనెల 30న తెలంగాణలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో (Telangana Elections) ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలకు సీఈవో వికాస్ రాజ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ (Vikas raj) తెలిపారు. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు సూచించారు.
విద్యాసంస్థలకు 2 రోజులు సెలవులు
అలాగే విద్యాసంస్థలకు కూడా బుధ, గురువారాల్లో (school holidays) రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ జరగనుంది. నగరంలోని పలు విద్యాసంస్థల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలించన్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు.