TSPSC paper leak case: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో 8 మందికి బెయిల్
ABN , First Publish Date - 2023-05-12T18:06:11+05:30 IST
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు (TSPSC paper leak case)లో మరో 8మందికి నాంపల్లి కోర్టు (Nampally Court) బెయిల్ మంజూరు చేసింది.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు (TSPSC paper leak case)లో మరో 8మందికి నాంపల్లి కోర్టు (Nampally Court) బెయిల్ మంజూరు చేసింది. 50వేల పూచీకత్తులు రెండు సమర్పించాలని ఆదేశించింది. పోలీసు విచారణకు సహకరించాలని, నిర్దేశించిన తేదీల్లో సిట్ అధికారుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. నీలేష్ నాయక్, కెతావత్ శ్రీనివాస్, రాజేందర్ నాయక్‌తో పాటు మరో ఐదుగురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో రేణుక రాథోడ్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.50వేల పూచీకత్తు, పాస్ పోర్టు సమర్పించాలని.. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో సిట్ ఎదుట హాజరు కావాలని కోర్టు రేణుకను ఆదేశించింది. చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్‌లో ఉన్న రేణుక గురువారం సాయంత్రం బెయిల్‌పై విడుదలయ్యారు. టీఎస్‌పీఎస్సీ (TSPSC) అసిస్టెంట్ ఇంజనీర్, ఏఈఈ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ఏ3గా ఉన్న రేణుక కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఇదే కేసుకు సంబంధించి రమేశ్, ప్రశాంత్‌లకు కూడా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా రేణుక భర్త ఢాక్యా నాయక్ జైల్లోనే ఉన్నారు. అతను పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది.