Bhatti Vikramarka: ప్రజలు ఆ రెండు పార్టీలకు బుద్ధి చెబుతారన్న భట్టి విక్రమార్క

ABN , First Publish Date - 2023-04-05T16:24:52+05:30 IST

సీఎం కేసీఆర్‌ (KCR)కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (CLP leader Bhatti Vikramarka) మరోసారి బహిరంగ లేఖ రాశారు.

Bhatti Vikramarka: ప్రజలు ఆ రెండు పార్టీలకు బుద్ధి చెబుతారన్న భట్టి విక్రమార్క

మంచిర్యాల: సీఎం కేసీఆర్‌ (KCR)కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (CLP leader Bhatti Vikramarka) మరోసారి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో సింగరేణి సంక్షోభంలో చిక్కుకుంటోందని, వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడం దారుణమని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సొమ్మును ఇతర అవసరాలకు మళ్లించడం సిగ్గుచేటని, సింగరేణిలో అవినీతి, అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని భట్టి ప్రశ్నించారు. ప్రశ్నాపత్రాల లీక్‌పై లోతైన దర్యాప్తు జరపాలని, బీఆర్‌ఎస్, బీజేపీ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాయని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రెండు పార్టీలకు బుద్ధి చెబుతారని భట్టి జోస్యం చెప్పారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర కొనసాగుతోంది. ఆదివారం మండలంలోని దాంపూర్‌ నుంచి బూరుగుపల్లి, పోతనపల్లి గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. సోమవారం మందమర్రి టౌన్‎లో యాత్ర కొనసాగింది. యాత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్‎కు(CM KCR) సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సోమవారం బహిరంగ లేఖ రాశారు. లేఖలో ‘‘పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 18 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నానని.. ఏ ఊరికి వెళ్లినా పోడు రైతులు పట్టాల కోసం ఎదురు చూస్తున్నారని భట్టి తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన పత్రాలు తప్ప మళ్ళీ రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని భట్టి గుర్తు చేశారు. పోడు రైతులందరికి పట్టాలు ఇవ్వాలని.. వారిపై ఉన్న కేసులను ఎత్తేయాలని భట్టి విక్రమార్క లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2023-04-05T16:29:38+05:30 IST