Share News

Telangana Results: బీఆర్ఎస్‌కు రాబోయే రోజుల్లో కొత్త సవాల్.. సెమీ అర్బన్ స్థానాల్లో బలపడిన కమలం..

ABN , First Publish Date - 2023-12-03T19:17:19+05:30 IST

తెలంగాణ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ ఆశ్చర్యకర ప్రదర్శన చేసింది. బీజేపీ తరఫున పోటీ చేసిన ముఖ్య అభ్యర్థుల్లో చాలా మంది ఓడిపోయారు. గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటిన బీఆర్‌ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆశించిన స్థాయిలో సీట్లు సంపాదిస్తుందనుకున్నారు.

Telangana Results: బీఆర్ఎస్‌కు రాబోయే రోజుల్లో కొత్త సవాల్.. సెమీ అర్బన్ స్థానాల్లో బలపడిన కమలం..

తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections) ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ (BJP) ఆశ్చర్యకర ప్రదర్శన చేసింది. బీజేపీ తరఫున పోటీ చేసిన ముఖ్య అభ్యర్థుల్లో చాలా మంది ఓడిపోయారు. గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆశించిన స్థాయిలో సీట్లు సంపాదిస్తుందనుకున్నారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా సెమీ-అర్బన్ స్థానాల్లో బీజేపీ అద్భుతంగా పుంజుకుంది. గత అసెంబ్లీ ఎలక్షన్స్‌తో పోల్చి చూస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ చాలా బలపడింది (Telangana Results).

బీజేపీకి ఈ ఎన్నికల్లో 8 స్థానాలే వచ్చినప్పటికీ గతంతో పోల్చుకుంటే ఓట్లు, సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంది. పలు చోట్ల బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీనిచ్చింది. 2018 ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కేవలం 7 శాతం ఓట్లను మాత్రమే సాధించి ఒక్క ఎమ్మెల్యే సీటునే గెల్చుకుంది. 105 చోట్ల డిపాజిట్లను కోల్పోయింది. ప్రస్తుత ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని 13 శాతానికి పెంచుకుని 8 సీట్లు సాధించింది. బీజేపీ ప్రముఖ నాయకులైన ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, బండి సంజయ్ వంటి వారు ఓడిపోయారు. కిషన్ రెడ్డి స్వంత నియోజకవర్గంలో కూడా బీజేపీ ఓటమి పాలైంది.

Telangana Results: గురువును మించిన శిష్యుడు.. దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పీకే శిష్యుడు సునీల్ పేరు!

సెమీ-అర్బన్ ప్రాంతాలైన సిర్పూర్, కామారెడ్డి, ముథోల్, ఆదిలాబాద్, ఆర్మూర్, నిర్మల్, నిజామాబాద్ అర్బన్ వంటి ప్రాంతాల్లో బీజేపీ గెలవడం బీఆర్‌ఎస్‌కు (BRS) కలవరం కలిగిస్తోంది. సాధారణంగా హైదరాబాద్ వెలుపల బీజేపీకి బలం ఉండదని చాలా మంది అనుకుంటారు. అయితే సెమీ అర్బన్ ప్రాంతాల్లోకి కూడా బీజేపీ చొచ్చుకు వెళ్లడం బీఆర్‌ఎస్‌కు రాబోయే రోజుల్లో మరింత ప్రమాదం కాబోతోంది. బీజేపీ ప్రస్తుతం గెలిచిన చాలా ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌కు గణనీయమైన ఓటు బ్యాంకు ఉండేది. గతంలో బీజేపీకి నామమాత్రంగా కూడా ఓట్లు పడేవి కాదు. అలాంటిది తెలంగాణ టౌన్‌ల్లోకి కూడా బీజేపీ చొచ్చుకువెళ్లగలిగింది. సెమీ-అర్బన్, రూరల్ ప్రాంతాల్లో బీజేపీకి ఆదరణ పెరిగితే కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీకి నష్టం అని చాలా మంది అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ సాంప్రదాయక ఓటర్లు కాకుండా బీఆర్‌ఎస్‌ ఓటర్లే ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచినట్టు చాలా మంది భావిస్తున్నారు.

Updated Date - 2023-12-03T19:17:21+05:30 IST