Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ప్లాంట్ గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదు: కిషన్ రెడ్డి
ABN , First Publish Date - 2023-04-16T16:53:04+05:30 IST
వైజాగ్ స్టీల్ప్లాంట్ (Vizag Steel Plant) గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) హెచ్చరించారు. బయ్యారం స్టీల్ఫ్లాంట్ (Bayyaram SteelPlant)ఏర్పాటు హామీని
హైదరాబాద్: వైజాగ్ స్టీల్ప్లాంట్ (Vizag Steel Plant) గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) హెచ్చరించారు. బయ్యారం స్టీల్ఫ్లాంట్ (Bayyaram SteelPlant)ఏర్పాటు హామీని సీఎం కేసీఆర్ (CM KCR) నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మూతపడిన పరిశ్రమలను తెరిపిస్తామన్న కేసీఆర్ నోరు విప్పాలన్నారు. స్టీల్ఫ్లాంట్ పేరుతో కల్వకుంట్ల కుటుంబం ఫోజులు కొడుతోందని దుయ్యబట్టారు. తెలంగాణను గాలికొదిలేసిని కేసీఆర్ ప్రభుత్వం.. బీఆర్‌ఎస్ (BRS) పేరుతో దేశాన్ని ఉద్దరిస్తాననటం హాస్పాస్పదంగా ఉందని ఎద్దేవాచేశారు. వంద రోజుల్లో నిజాం ఘగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని, తొమ్మిదేళ్లు అవుతున్న ఎందుకు పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.
విశాఖ ఉక్కు చుట్టూ వింత వింత ప్రచారాలు, విచిత్ర విన్యాసాలూ సాగుతున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం అమ్మేయడానికి యత్నిస్తుంటే... దానిని అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణా సీఎం కేసీఆర్ సింగరేణి కాలరీస్ (Singareni Calories)తో బిడ్ వేయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే... అసలు వాస్తవం వేరు. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియకు, ప్రైవేటీకరణకు సంబంధం లేదు. ‘ముడిపదార్థాల సరఫరా లేదా వర్కింగ్ క్యాపిటల్‌ను సమకూర్చితే... దానికి సమానమైన విలువగల స్టీల్ ఇస్తాం.. ఆసక్తి ఉన్న వాళ్లు ముందుకు రండి’ అని విశాఖ స్టీల్స్ ‘ఆసక్తి వ్యక్తీకరణ’ (ఈవోఐ) ప్రకటన జారీ చేసింది. అంతే తప్ప... ఇది స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కానే కాదు.
కేసీఆర్... అప్పుడలా, ఇప్పుడిలా!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవని, బయ్యారం గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. దీనిపై పార్లమెంటులో బిల్లు కూడా పెట్టారు. అప్పుడు ఎంపీగా ఉన్న కేసీఆర్ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘తెలంగాణ బొగ్గును ఆంధ్రకు దోచి పెడతారా. బయ్యారం గనులు ఇచ్చేందుకు ఒప్పుకోం’’ అని తేల్చిచెప్పారు. ఇప్పుడు అదే కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి ద్వారా విశాఖ ఉక్కును కాపాడతామని చెబుతుండటం విశేషం.