BRS MP: మణిపూర్ అల్లర్లపై మోదీ స్టేట్‌మెంట్ ఇవ్వాలి
ABN , First Publish Date - 2023-07-25T12:39:21+05:30 IST
మణిపూర్ అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్టేట్‌మెంట్ ఇవ్వాలని.. మణిపూర్ ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపాలని బీఆర్‌ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: మణిపూర్ అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendramodi) స్టేట్‌మెంట్ ఇవ్వాలని.. మణిపూర్ ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపాలని బీఆర్‌ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి (BRS MP KR Sureshreddy) డిమాండ్ చేశారు. మంగళవారం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో మణిపూర్ అల్లర్లపై చర్చ జరపాలని రాజ్యసభ ఎంపీలకు బీఆర్‌ఎస్ పార్టీ విప్ జారీ చేసినట్లు తెలిపారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మణిపూర్, ఢిల్లీ ఆర్డినెన్సుపై వాయిదా తీర్మానం ఇచ్చారని... దానికే ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను చైర్మన్ సస్పెండ్ చేశారన్నారు. ఆప్ ఎంపీకి బీఆర్‌ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ మణిపూర్ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మణిపూర్‌లో మహిళలపై జరిగిన దాడి దేశం మొత్తం చూసిందన్నారు. వరుసగా మణిపూర్ అంశంపై వాయిదా తీర్మానం ఇస్తున్నామని చెప్పారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సహితం కేంద్ర ప్రభుత్వాన్ని మణిపూర్ అంశాన్ని పరిశీలించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం మొండి మైఖరి అవలబిస్తోందని విమర్శించారు. దేశంలో అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు .తెలంగాణ నుంచి హిమాచల్ వరకు వరదలు ఉన్నాయని..వాటి పైన కూడా చర్చించాలన్నారు. లోక్‌సభ, రాజ్యసభ చైర్మన్‌లను కేంద్రం ఇబ్బందిలో పెట్టే విధంగా వ్యవహరిస్తోందన్నారు. రాజకీయాలకు ఇది సమయం కాదని బీఆర్‌ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి పేర్కొన్నారు.