Chikoti Praveen : మరో వివాదంలో చికోటి ప్రవీణ్.. ఈసారి గట్టిగానే..?

ABN , First Publish Date - 2023-07-17T17:27:24+05:30 IST

అవును.. క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ (Chikoti Praveen) మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఆదివారం నాడు పాతబస్తిలో జరిగిన లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గరికి ప్రైవేట్ సెక్యూరిటితో చికోటి వచ్చాడు...

Chikoti Praveen : మరో వివాదంలో చికోటి ప్రవీణ్.. ఈసారి గట్టిగానే..?

అవును.. క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ (Chikoti Praveen) మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఆదివారం నాడు పాతబస్తిలో జరిగిన లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గరికి ప్రైవేట్ సెక్యూరిటితో చికోటి వచ్చాడు. ఆ సిబ్బందిలో ముగ్గురి వద్ద ఆయుధాలు ఉండటంతో టాస్క్‌ఫోర్సు పోలీసులు వారిని అదుపులోనికి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఆ వెపన్స్‌కు లైసెన్స్ లేకపోవడంతో చత్రినాక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. చికోటి ప్రవీణ్‌తో పాటు ముగ్గురు వ్యక్తిగత సిబ్బందిపై కూడా చీటింగ్, ఫోర్జరీ, ఆర్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. U/S: 420, 467, 468, 471 IPC and Sec 25(1),(b)(A) & Sec 30 of Arms Act కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. A1 గా చికోటి ప్రవీణ్, A2 గా రాకేష్, A3 గా సుందర్ నాయక్, A4 గా రమేష్ గౌడ్‌లపై కేసులు నమోదయ్యింది. ఈ నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కాగా.. జన సమూహంలోకి ప్రైవేటు సిబ్బందితో రావడం చట్టారీత్యా నేరమన్న విషయం తెలిసిందే.


Chikoti-ED-Enquiry.jpg

త్వరలో రాజకీయ అరంగేట్రం..!

అయితే.. ఆయుధాల లైసెన్స్ కోసం ఒరిజనల్ డాక్యుమెంట్లు ఏడాది క్రితం చత్రినాక పోలీస్ స్టేషన్‌కు పంపామని చికోటి ప్రవీణ్ చెబుతుండటం గమనార్హం. ఇదంతా.. తనపై రాజకీయ కక్ష సాదింపు అని ఆయన ఆరోపిస్తున్నాడు. గజ్వేల్ ఘటన తర్వాత తనను టా‌ర్గెట్ చేశారన్నాడు. ‘ నాకు ప్రాణహాని ఉందని ప్రైవేట్ భద్రత ఏర్పాటు చేసుకున్నాను. గన్స్‌కు లైసెన్స్ ఉంది. మతం కోసం, హిందుత్వం కోసం నేను పోరాటం చేస్తాను. త్వరలో ఓ రాజకీయ పార్టీలో చేరుతున్నాను. రాజకీయంగా నన్ను ఎదుర్కొనలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. హిందుత్వంపై పోరాటం చేస్తున్న కాబట్టే నాపై కక్ష కట్టారు. నా సెక్యూరిటీ తప్పు చేస్తే, నేను పోలీసులకు సరెండర్ చేస్తాను. దొంగలను ఈడ్చుకెళ్లినట్లు నా వ్యక్తిగత సెక్యురిటీని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈడ్చుకెళ్లడం సరైంది కాదు’ అని చికోటి చెప్పుకొచ్చాడు. ఇప్పటికే పలు కేసుల్లో చిక్కుకున్న చికోటి.. ఇప్పుడు ఈ వెపన్స్ కేసులో ఇరుక్కున్నాడు. ఈసారి చికోటిపై పోలీసులు కఠిన చర్యలే తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Chikoti-Security.jpg

Chikoti Praveen : బోనాలకు వచ్చిన చికోటి ప్రవీణ్‌ను చూసి అవాక్కైన పోలీసులు.. అసలేం జరిగిందంటే..?


Updated Date - 2023-07-17T17:30:33+05:30 IST