CPI Narayana: జమిలి ఎన్నికలపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-09-03T13:10:31+05:30 IST

సీఐఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సైన్స్ పరంగా ఇస్రో శాస్త్రవేత్తలను అందరం అభినందించాలని వ్యాఖ్యానించిన ఆయన.. ఇస్రో ప్రయత్నాలకు మతం రంగు పులమాలని చూస్తున్నారని ప్రధాని మోదీపై మండిపడ్డారు. ఇస్రో ప్రయత్నాలను అవకాశంగా వాడుకోవాలని చూస్తున్నారని అన్నారు.

CPI Narayana: జమిలి ఎన్నికలపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: సీఐఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సైన్స్ పరంగా ఇస్రో శాస్త్రవేత్తలను అందరం అభినందించాలని వ్యాఖ్యానించిన ఆయన.. ఇస్రో ప్రయత్నాలకు మతం రంగు పులమాలని చూస్తున్నారని ప్రధాని మోదీపై మండిపడ్డారు. ఇస్రో ప్రయత్నాలను అవకాశంగా వాడుకోవాలని చూస్తున్నారని అన్నారు. ‘‘ బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ఇక కనుమరుగు అయ్యింది. కానీ దేశం మొత్తం ఒకే పార్టీ ఒకే అధికారం ఉండాలని మోడీ చూస్తున్నారు. దేశవ్యాప్తంగా కొన్ని కారణాల వల్ల బీజేపీ గెలిచింది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. మణిపూర్‌లో ఘటనలు చాలా బాధాకరం. ఇవి పైకి రానివ్వకుండా వచ్చే ఎన్నికలు మత ప్రాతిపదికన జరగాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది. బీజేపీలో ఉన్న ఎన్‌డీఏ కూటమిలో 8 పార్టీలు తప్ప మిగితా పార్టీలు అన్ని ఉత్తవే. జమిలీ ఎన్నికలు అంటూ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలతో కేంద్రం చర్చించలేదు. పార్టీలతో చర్చించకుండా రాజ్యాంగ మార్పు, సవరణ ఎలా చేస్తారు?’’ అని ప్రశ్నించారు.


న్యాయవ్యవస్థ లాంటి వాటిని మార్చేశారని మోదీ సర్కారుపై సీపీఐ నారాయణ మండిపడ్డారు. వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది మరికొన్ని రాష్ట్రాలకు మొత్తం 10 రాష్ట్రాల ఎన్నికలతో పార్లమెంట్ ఎన్నికలు జరపాలని కేంద్రం చూస్తోంది. ఇండియా కూటమి సమావేశం జరగ్గానే వెంటనే ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చి పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తోంది. ఇండియా కూటమిని చూసి బీజేపీ భయపడింది. కేంద్రం వేసిన కమిటీ ఒక బోగస్. అమిత్ షా రాసిన స్క్రిప్ట్‌కు వీళ్ళు సంతకాలు పెట్టడం తప్ప వాళ్ళు చేసేదేమీ లేదు. రామనాథ్ కోవింద్ నేతృత్వంలో వేసిన కమిటీని మేము బహిష్కరించాలని చూస్తున్నాం. ఈ కమిటీని అందరం కలిసి కట్టుగా నిర్వీర్యం చేయాలి’’ అని నారాయణ అన్నారు.

Updated Date - 2023-09-03T13:10:36+05:30 IST