TS News: ‘దరణి’ దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం: భట్టి విక్రమార్క
ABN , First Publish Date - 2023-06-09T20:34:24+05:30 IST
‘ధరణి’ పేరుతో బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి పాల్పడుతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆరోపించారు.
దేవరకొండ: ‘ధరణి’ పేరుతో బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి పాల్పడుతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆరోపించారు. ప్రజా సమస్యలపై తాను లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ (CM KCR) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ‘ధరణి’ సాప్ట్‌వేర్ తెచ్చి కుట్రపూరితంగా పేదల భూములను లాక్కోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. పేదల భూములు లాక్కొని తెలంగాణ ప్రభుత్వం శ్మశానవాటికలు, రైతువేదికలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలతోపాటు అమెజాన్ వంటి కంపెనీలకు భూములు అప్పగిస్తోందని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ దొరల పక్షాన నిలుస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే ప్రజా సమస్యలపై తాను లేవనెత్తిన అంశాలను చర్చించడానికి సిద్ధంగా ఉండాలని భట్టి విక్రమార్క సవాల్ విసిరారు.