TS News: బలగానికి బలం
ABN , First Publish Date - 2023-06-04T15:53:36+05:30 IST
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కులవృత్తులకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ చాత్తాద శ్రీవైష్ణవ సంఘం స్వాగతించింది.
సంగారెడ్డి: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కులవృత్తులకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ చాత్తాద శ్రీవైష్ణవ సంఘం స్వాగతించింది. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్ (Chief Minister KCR) సహృదతకు నిదర్శమని సంఘ రాష్ట్ర అధ్యక్షులు అశ్వాపురం వేణుమాధవ్ కొనియాడారు. కులవృత్తులకు రూ. లక్ష ఆర్థిక సాయం పథకం బీసీల అభ్యున్నతికి, కులవృత్తుల పునర్ వైభవానికి, అణగారిన వర్గాల ఆర్ధిక స్వాలంబనకు ఎంతో దోహదపడుతుందని బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి తోమాల కొండస్వామి పేర్కొన్నారు. చాత్తాద శ్రీవైష్ణవుల్లో ఎంతో మంది ఇప్పటికీ పేదరికంలో ఉన్నారని తెలిపారు. రూ.లక్ష ఆర్థిక సాయం పథకంతో చాత్తాద శ్రీవైష్ణవులకు ఆర్థిక స్వాలంబన కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ అందించబోతున్న రూ.లక్ష ఆర్థిక సాయం.. బీసీల అభివృద్ధికి తోడ్పడుతుందని కొండస్వామి పేర్కొన్నారు.