Home » Sangareddy
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పెద్ద కంజర్లలో దారుణం చోటు చేసుకుంది. మత్తుకు బానిసైన ఓ వ్యక్తి తన భార్యపై దాడి చేశాడు. విచక్షణారహితంగా రోకలిబండతో కొట్టాడు.
ఎన్వోసీ జారీ చేసేందుకు రూ. పది లక్షల లంచం డిమాండ్ చేసిన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల నీటిపారుదల శాఖ ఏఈ రవికిషోర్ ఏసీబీకి చిక్కారు. పటాన్‌చెరులోని నీటిపారుదల శాఖ డివిజనల్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మహిళలకు అన్నిరంగాల్లో అవకాశాలు కల్పించి ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడుతున్న ప్రభుత్వాలు.. డ్రోన్లను ఆపరేట్ చేయడంలోనూ వారికి శిక్షణ ఇస్తున్నాయి. పంట పొలాల్లో పురుగు మందులను పిచికారీ చేసేందుకు డ్రోన్లను వినియోగించడంపై మహిళలకు తర్ఫీదునిస్తున్నాయి.
సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిష్ఠిత సంస్థ హోదా కల్పించింది.
అభంశుభం తెలియని ముగ్గురు పిల్లలు రాత్రి నిద్రపోయినవారు నిద్రపోయినట్లుగా ప్రాణాలొదలడం.. పక్కనే నిద్రించిన తల్లి అర్ధరాత్రి తర్వాత కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైన ఘటన గుర్తుందా? వారం క్రితం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో జరిగిన ఈ ఘటనలో వేళ్లన్నీ భర్తవైపే చూపాయి.
Ameenpur Case Twist: అమీన్పూర్లో ముగ్గురు చిన్నారుల అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్ బయటపడింది. వివాహేతర సంబంధమే వీరి హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు.
ఆ దంపతులకు పదేళ్లలోపు వయసున్న ముగ్గురు పిల్లలున్నారు. రాత్రి చిన్నారులతో కలిసి భోజనం చేసి పడుకున్నారు. తెల్లవారుజామున భార్య కడుపునొప్పి భరించలేక హాహాకారులు చేయగా.. పడుకున్న ముగ్గురు పిల్లలు పడుకున్నట్లుగానే చనిపోయి ఉన్నారు.
డ్రోన్ల తయారీపై దృష్టి సారించిన భారత ఆర్మీ తాజాగా అత్యాధునిక ఫస్ట్ పర్సన్ వ్యూ (ఎఫ్‌పీవీ) కమికాజె (ఆత్మాహుతి) డ్రోన్‌ను విజయవంతంగా పరీక్షించింది. శుక్రవారం పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో నిర్వహించిన ఈ పరీక్షలో నిర్దేశిత లక్ష్యం వద్దకు మందుగుండు సామగ్రితో వెళ్లిన డ్రోన్ దాన్ని సమర్థంగా పేల్చివేసింది.
హోలీ వేడుకల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సందడి చేశారు. సంగారెడ్డిలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల్లో తన చిన్ననాటి మిత్రులు, సన్నిహితులు, స్థానిక ప్రజలపై రంగులు చల్లారు.
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటమే ఇందుకు కారణం. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం సమీపంలోని ఓ పౌల్ర్టీఫాంలో మూడు రోజుల వ్యవధిలో ఏడు వేల కోళ్లు మరణించాయి.