ప్రమాద వివరాలు బహిర్గతం చేయాలి

ABN , First Publish Date - 2023-02-14T01:04:37+05:30 IST

మండల పరిధిలోని దోతిగూడెం గ్రామంలోని ఎస్‌వీఆర్‌ రసాయన పరిశ్రమలో జరిగి న ప్రమాదం వెనుక నిజాలను బహిర్గతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కల్లూరి మల్లేశం డిమాండ్‌ చేశారు. సోమవారం వారు ఎస్‌వీఆర్‌ కెమికల్‌ ల్యాబ్‌ ను సందర్శించారు.

ప్రమాద వివరాలు బహిర్గతం చేయాలి

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కల్లూరి మల్లేశం

భూదాన్‌పోచంపల్లి, ఫిబ్రవరి 13: మండల పరిధిలోని దోతిగూడెం గ్రామంలోని ఎస్‌వీఆర్‌ రసాయన పరిశ్రమలో జరిగి న ప్రమాదం వెనుక నిజాలను బహిర్గతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కల్లూరి మల్లేశం డిమాండ్‌ చేశారు. సోమవారం వారు ఎస్‌వీఆర్‌ కెమికల్‌ ల్యాబ్‌ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే అనుమతించలేదని, దీన్నిబట్టి పరిశ్రమలో పెద్ద ప్రమాదం జరిగినట్లు అర్థమవుతోందన్నారు. తక్షణమే అధికారులు పరిశ్రమను సందర్శించి పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంపై నిజాలను నిగ్గుతేల్చాలన్నారు. ఇదే పరిశ్రమలో ఇప్పటికి నాలుగోసారి అగ్నిప్రమాదం జరిగిందని, అధికారులు పరిశ్రమలో ఉన్న లోటుపాట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే సీఐటీయూ ఆధ్వర్యంలో కంపెనీ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పగిల్ల లింగారెడ్డి, నాయకులు ప్రసాదం విష్ణు, సీఐటీయూ మండల కన్వీనర్‌ మంచాల మధు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-14T01:04:40+05:30 IST