Electric bus: రేపటి నుంచి 219 రూట్‌లో 24 నిమిషాలకు ఒక ఎలక్ట్రిక్ బస్సు
ABN , Publish Date - Dec 14 , 2023 | 08:27 AM
గ్రేటర్ వ్యాప్తంగా మెట్రో ఎలక్ర్టిక్ ఏసీ బస్సు(Metro Electric AC Bus)లను నడిపేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది.

హైదరాబాద్: గ్రేటర్ వ్యాప్తంగా మెట్రో ఎలక్ర్టిక్ ఏసీ బస్సు(Metro Electric AC Bus)లను నడిపేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది. సికింద్రాబాద్-పటాన్‌చెరు మార్గంలో 8 ఎలక్ర్టిక్ మెట్రో ఏసీ బస్సులను ఈనెల 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఈడీ వెంకటేశ్వర్లు(ED Venkateswarlu) బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 219 రూట్‌లో 24 నిమిషాలకు ఒక ఏసీ మెట్రో గ్రీన్ బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్యారడైజ్, బోయిన్‌పల్లి, బాలానగర్, కూకట్‌పల్లి మీదుగా పటాన్‌చెరు(Patancheru)కు బస్సులు నడుపుతామన్నారు. సికింద్రాబాద్ నుంచి మొదటి బస్సు ఉదయం 6.10, చివరి బస్సు రాత్రి 8.28 గంటలకు, పటాన్‌చెరు నుంచి మొదటి బస్సు ఉదయం 7.45, చివరి బస్సు రాత్రి 10.3 గంటలకు ఉంటుందని పేర్కొన్నారు.