Etela Rajender : సీఎం ఫామ్‌హౌస్‌కి వస్తున్నారంటే...
ABN , First Publish Date - 2023-11-07T13:35:13+05:30 IST
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో 15 సంవత్సరాలు ఉన్నానని.. తాను పరాయి వాడిని కాదని.. ఈ నియోజకవర్గ బిడ్డనేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. గజ్వేల్ ప్రజలకు ఏ అవసరమైనా వస్తే ఎప్పుడైనా కలిశారా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో 15 సంవత్సరాలు ఉన్నానని.. తాను పరాయి వాడిని కాదని.. ఈ నియోజకవర్గ బిడ్డనేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. గజ్వేల్ ప్రజలకు ఏ అవసరమైనా వస్తే ఎప్పుడైనా కలిశారా? అని ప్రశ్నించారు. ఫామ్ హౌస్‌లో ముఖ్యమంత్రి ఉంటే చుట్టూ ప్రక్కల గ్రామాలు తీవ్ర ఇబ్బందికి గురయ్యాయన్నారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌కి వస్తున్నారంటే రోడ్డు పక్కన కంకులు, జామకాయలు అమ్ముకునే వారికి కూడా ఇబ్బందేనని ఈటల పేర్కొన్నారు.
ఈ రోజు తాను నామినేషన్‌కి వస్తున్నానని ప్రజలు తన ర్యాలీలకు రాకుండా ఆపడానికి కోట్ల రూపాయలతో ప్రజలను అడ్డుకోవాలని చూశారని ఈటల పేర్కొన్నారు. ఈ ఎన్నిక కేసీఆర్ అహంకారానికి.. మన ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతోందన్నారు. గజ్వేల్‌లో ఇళ్లు లేని వారందరికీ డబుల్ బెడ్ రూంలు కట్టిస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే ఒకరికే పెన్షన్ వస్తుందని.. అదే బీజేపీ అధికారంలో ఉంటే ఇద్దరికీ వస్తుందని ఈటల రాజేందర్ వెల్లడించారు.