Godavari : స్వల్పంగా గోదావరి వరద తగ్గుముఖం
ABN , First Publish Date - 2023-07-22T08:15:11+05:30 IST
గోదావరి వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. భద్రాచలం దగ్గర ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 39.5 అడుగులుగా ఉంది. దిగువన శబరి నది పోటు వలన గోదావరి ప్రవాహం నిదానంగా మారింది.
భద్రాచలం : గోదావరి వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. భద్రాచలం దగ్గర ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 39.5 అడుగులుగా ఉంది. దిగువన శబరి నది పోటు వలన గోదావరి ప్రవాహం నిదానంగా మారింది. ఇక ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.6 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. మరోవైపు తాలిపేరు రిజర్వాయిర్ వద్ద సైతం వరద తగ్గుముఖం పట్టింది. 4 గేట్లు ఎత్తి 12416 క్యూ సెక్కుల నీటిని విడుదల చేసింది. ఇన్ ఫ్లో 16560 క్యూసెక్కులుగా ఉంది.