Home » Godavari
కృష్ణా జలాల పంపిణీపై విచారణలో జాప్యం లేకుండా వెంటనే వాదనలు ప్రారంభించడానికి అవకాశం ఇవ్వాలని జస్టిస్ బ్రిజే్షకుమార్ ట్రైబ్యునల్ను తెలంగాణ కోరింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం అటవీ ప్రాంతంలో బుధవారం భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. గతంలో ఇదే ప్రాంతంలో భారీ గాలులకు లక్షలాది చెట్లు నెలకొరిగాయి. మళ్లీ అదే ప్రాంతంలో భూమి కంపించింది.
ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదన దశలోనే ఉన్న గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియ కార్యరూపం దాల్చడానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
గోదావరి-కావేరి అనుసంధానంలో తరలించే 148 టీఎంసీల్లో 74 టీఎంసీల నీటిని కేటాయించాలన్న తెలంగాణ విజ్ఞప్తిని జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) తోసిపుచ్చింది.
కృష్ణా బేసిన్ పరిధిలోని అన్ని ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్లు) కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లో అనుమతుల కోసం దాఖలు చేసి, ట్రైబ్యునల్లో ఆయా ప్రాజెక్టుల నీటి కేటాయింపుల కోసం పట్టుబట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
యానాం దర్యాలతిప్ప, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్య గోదావరి నదిలో భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. ఓఎన్జీసీ సంస్థ వేసిన గ్యాస్ లైన్ నుంచి లీక్ కావడం స్థానికంగా కలకలం రేపుతోంది.
గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని భూభాగంలో చమురు, సహజవాయువుల నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని బీర్బల్ సాహ్ని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్ (బీఎ్సఐపీ) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
గోదావరి నీటిమట్టం గురువారం తగ్గుముఖం పట్టింది. వరద తగ్గినప్పటికీ ఇంకా ఉగ్రంగానే ప్రవహిస్తోంది.
Andhrapradesh: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద శాంతిస్తోంది. ఉదయం 7 గంటల నుంచి గోదావరి భారీ వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. 15.30 అడుగులకు పెరిగి అర్ధరాత్రి నుంచి నిలకడగా గోదావరి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం 15.10 అడుగులకు నీటిమట్టం తగ్గింది.
Andhrapradesh: ఏపీలో గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి వరద పెరుగుతోంది. వేలేరుపాడు మండలం రుద్రంకోటతో పాటు పలు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి.