Hyderabad : భాగ్యనగరంలో ‘ఆల్ఫా’ హోటల్ సీజ్.. కారణమేంటంటే..?

ABN , First Publish Date - 2023-09-17T22:29:40+05:30 IST

హైదరాబాద్‌లో ‘ఆల్ఫా’ హోటల్‌కు (Alpha Hotel) ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఒక్కసారైనా ఇక్కడ తినాలని బిర్యానీ ప్రియులు అనుకుంటూ ఉంటారు...

Hyderabad : భాగ్యనగరంలో ‘ఆల్ఫా’ హోటల్ సీజ్.. కారణమేంటంటే..?

హైదరాబాద్‌లో ‘ఆల్ఫా’ హోటల్‌కు (Alpha Hotel) ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఒక్కసారైనా ఇక్కడ తినాలని బిర్యానీ ప్రియులు అనుకుంటూ ఉంటారు. మరీముఖ్యంగా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన జనాలు ఇక్కడ బిర్యానీ, రోటీలు, చికెన్, మటన్ కర్రీలకోసం తెగ క్యూ కట్టేస్తూ ఉంటారు. నిత్యం వేల మంది కస్టమర్లు వస్తూ.. టీ దగ్గరి నుంచి బిర్యానీ వరకు తమకు నచ్చిన ఫుడ్ ఐటెంను తింటుంటారు. ఎందుకంటే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉండటంతో అటు రైలు దిగి.. అల్ఫా వైపు అడుగులేస్తుంటారు జనాలు. అయితే.. అందరూ మెచ్చిన, నచ్చిన ‘ఆల్ఫా’ ఇప్పుడు సీజ్ అయ్యింది.


Alpha-Hotel.jpg

అసలేం జరిగింది..?

ఇటీవల కొందరు యువకులు ఈ అల్ఫాలో మటన్ కీమా, రోటీ తిన్నారు. తిన్న కొద్దిసేపటికే వాళ్లంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ యువకుల మిత్రులు కొందరు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. వెంటనే రంగంలోకి దిగిపోయారు. హోటల్‌లో నిశితంగా తనిఖీలు చేయగా.. నాణ్యత, శుభ్రత లేదని గుర్తించిన అధికారులు వెంటనే హోటల్‌ను సీజ్ చేశారు. ఈ మేరకు ఆల్ఫా హోటల్‌ను యాజమాన్యానికి అధికారులు నోటీసులు అందించారు. కాగా.. అస్వస్థతకు గురైన యువకుల పరిస్థితి.. నిలకడగానే ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా.. ఆ రోటీలను పరిశీలించగా దుర్వాసన వస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Roti-and-Mutton.jpg

Updated Date - 2023-09-17T22:30:08+05:30 IST