Liquor Rates : మందుబాబులకు అదిరిపోయే శుభవార్త.. మద్యం ధరలు భారీగా తగ్గాయోచ్..
ABN , First Publish Date - 2023-05-05T22:03:27+05:30 IST
మద్యం ధరలు (Liquor Prices) భారీగా తగ్గాయి. ధరలు తగ్గిస్తున్నట్లు శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. మద్యంపై రాష్ట్ర ప్రభుత్వం..
మద్యం ప్రియులకు తెలంగాణ సర్కార్ (TS Govt) అదిరిపోయే శుభావార్త (Good News) చెప్పింది. తెలంగాణలో మద్యం ధరలు (Liquor Prices) భారీగా తగ్గాయి. ధరలు తగ్గిస్తున్నట్లు శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. మద్యంపై రాష్ట్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో మద్యం ధరలు తగ్గిపోయాయి. బీర్ మినహా లిక్కర్‌కు చెందిన అన్ని బ్రాండ్లపై ధరలు తగ్గాయి. అధిక ధరలు కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు తేల్చారు. ఇకపై అలా ఉండకూడదని దీన్ని నియంత్రించేందుకు ధరలు తగ్గించినట్లు అధికారులు తెలిపారు.
ధరలు తగ్గింపు ఇలా..
క్వార్టర్‌పై : రూ.10 తగ్గింపు
హాఫ్‌పై : రూ.20 తగ్గింపు
ఫుల్‌పై : రూ. 40 చొప్పున ధరలు తగ్గాయి. మరోవైపు.. కొన్ని రకాల బ్రాండ్స్‌లో ఫుల్ బాటిళ్లపై 60 రూపాయిల వరకు తగ్గిస్తున్నట్లు అబ్కారీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా తగ్గిన ఈ ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి రానున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. కరోనా లాక్‌డౌన్ తర్వాత ఆదాయాన్ని పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా మద్యం ధరలను పెంచిన సంగతి తెలిసిందే. దీంతో జనాలంతా పక్క రాష్ట్రాలకు వెళ్లి మరీ తెచ్చుకుంటూ ఉండటంతో అబ్కారీ అధికారులు పై నిర్ణయం తీసుకున్నారు.