Viveka Murder Case: భాస్కర్ రెడ్డి కస్టడీపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ
ABN , First Publish Date - 2023-04-17T11:07:32+05:30 IST
హైదరాబాద్: వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో సీబీఐ (CBI) దూకుడు కొనసాగుతోంది. నిన్న వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయగా.. మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు.
హైదరాబాద్: వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో సీబీఐ (CBI) దూకుడు కొనసాగుతోంది. నిన్న వైఎస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy)ని అరెస్టు చేయగా.. మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ (14 Days Remand) విధించారు. దీంతో 10 రోజుల కస్టడీ (Custody) కోరుతూ సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం నాంపల్లి కోర్టు (Nampalli Court)లో విచారణ జరగనుంది.
వైఎస్ వివేకాపై భాస్కర్ రెడ్డి, దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి అతని కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారని సీబీఐ తెలిపింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను భాస్కర్ రెడ్డి ఓడించారనే కారణంతో వారిపై వివేక ఆగ్రహం వ్యక్తం చేశారని సీబీఐ పేర్కొంది. వివేకాపై చాలా కాలంగా భాస్కర్ రెడ్డి కక్ష పెంచుకున్నారని, భాస్కర్ రెడ్డి ఇంట్లోనే హత్యకు పథకం రచించారని సీబీఐ స్పష్టం చేసింది. హత్యకు నెల రోజులు ముందు నుంచి ప్లాన్ చేసుకున్నారని, ఎర్ర గంగి రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి సహాయంతో హత్య చేశారని సీబీఐ తెలిపింది.
నిందితులకు భారీ నగదు ఆఫర్ చేశారని సీబీఐ వెల్లడించింది. హత్యలో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని, కస్టడీకి ఇస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సీబీఐ భావిస్తోంది. కస్టడీ పిటిషన్‌పై సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అలాగే ఉదయ్ కుమార్ రెడ్డి కస్టడీ పిటిషన్ కూడా విచారణకు రానుంది.