TS Election 2023 : తెలంగాణలో మొత్తం ఓటర్లు ఎంత మంది..? ఇన్ని ఓట్లు తొలగించారా..?

ABN , First Publish Date - 2023-10-09T13:41:38+05:30 IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Polls) నగారా మోగింది. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సీఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. నేటి నుంచే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది...

TS Election 2023 : తెలంగాణలో మొత్తం ఓటర్లు ఎంత మంది..? ఇన్ని ఓట్లు తొలగించారా..?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Polls) నగారా మోగింది. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సీఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. నేటి నుంచే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఈ సందర్భంగా తెలంగాణలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు..? ఎంత మంది కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు..? రాష్ట్రంలో ఎన్ని ఓట్లు తొలగించారు..? 18-19 ఏళ్ల వయస్సు ఓటర్లు ఎంత మంది ఉన్నారు..? అనే విషయాలను ఎన్నికల కమిషనర్ నిశితంగా వివరించారు.


CEC-Rajiv-Kumar.jpg

ఎంత మంది ఓటర్లు..?

మొత్తం ఓటర్ల సంఖ్య : 3.17,17,389 మంది

18-19 ఏళ్ల వయస్సు ఓటర్లు : 3,35,043 మంది

కొత్త ఓటర్లు : 17,01,087 మంది

తొలగించిన ఓట్లు : 6,10,694 మంది

పోలింగ్ కేంద్రాల సంఖ్య : 35,356 పోలింగ్ స్టేషన్లు

పట్టణ ప్రాంతాల్లో : 14,484 పోలింగ్ స్టేషన్లు

గ్రామీణ ప్రాంతాల్లో : 20,892 పోలింగ్ స్టేషన్లు

TS-Electtions.jpg

పోలింగ్, ఫలితాలు ఎప్పుడు..?

ఒకే విడతలో ఎన్నికలు

మొత్తం అసెంబ్లీ స్థానాలు : 119 స్థానాలు

నోటిఫికేషన్ : నవంబర్-03 (శుక్రవారం)

నామినేషన్లకు చివరి తేదీ : నవంబర్-10 (శుక్రవారం)

నామినేషన్ల పరిశీలన : నవంబర్-13 (సోమవారం)

ఉపసంహరణ చివరి తేదీ : నవంబర్-15 (బుధవారం)

పోలింగ్ తేది : నవంబర్-30 (గురువారం)

కౌంటింగ్ : డిసెంబర్-03 (ఆదివారం).

Voters.jpg

TS Assembly Polls : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడంటే..?

Updated Date - 2023-10-09T13:41:38+05:30 IST