Home » Telangana BJP
కాలుష్యం.. మానవాళికి ప్రమాదకరంగా మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో సామాజిక స్పృహ పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి వ్యక్తికి సామాజిక భాధ్యత తప్పని సరిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. దశాబ్దం క్రితం గాంధీ జయంతి రోజునే మోడీ స్వచ్చా భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గుర్తు చేశారు.
మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటో క్రిమినల్ కోర్టు ధిక్కరణ పిటిషన్‌గా సీజే ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీజేకు హైకోర్టు న్యాయమూర్తి లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల్లో టీడీపీ (Telugu Desam) కూటమి ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత, సీఎం నారా చంద్రబాబు తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తెలుగుదేశం పుట్టి, పెరిగిన గడ్డ తెలంగాణ కావడంతో పార్టీని బలోపేతం చేయడంతో పాటు అధికారంలోకి రావడమే నెక్స్ట్ టార్గెట్‌గా సీబీఎన్ దూసుకెళ్తున్నారు..! ఈ క్రమంలోనే ప్రతి 15 రోజులకోసారి..
తెలంగాణలో ‘విలీనం’ పై గట్టిగానే రాజకీయాలు నడుస్తున్నాయ్..! అదిగో ఫలానా పార్టీ.. ఈ పార్టీలో విలీనం కాబోతోందని ఓ జాతీయ పార్టీ అంటే.. అబ్బే మీరు మీరే ఒకటి కాబోతున్నారని మరో జాతీయ పార్టీ అంటోంది..! ఈ విషయంలో ఎవ్వరూ తగ్గట్లేదు. ఈ అన్నింటిలోనూ కామన్‌గా బీఆర్ఎస్ పార్టీ ఉంది..! బీజేపీతో బీఆర్ఎస్కు సన్నిహిత సంబంధాలున్నాయన్నది కొన్నేళ్లుగా నడుస్తున్నదే..!
తెలంగాణలో తమ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ (BL Santosh) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు బీజేపీ కార్యాలయానికి బీఎల్ సంతోష్ వచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ అగ్రనేత సమావేశమయ్యారు.
అవును.. మీరు వింటున్నది నిజమే..! ఇలాంటివి మామూలుగా సినిమాల్లో లేకుంటే సీరియల్స్‌లో చూస్తుంటాం..! ప్రజాప్రతినిధులు అది కూడా అసెంబ్లీ వేదికగా అంటే ఎవరూ నమ్మరు.. నమ్మలేరు అంతే..! కానీ మీరు వింటున్నది మాత్రం అక్షర సత్యమే..! ఈ ‘తొడగొట్టుడు’ సీన్ తెలంగాణ అసెంబ్లీ వేదికగా జరిగింది. అది కూడా...
తెలంగాణలో శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం సాగింది. కేంద్రబడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరగడంపై జరిగని చర్చలో భాగంగా రేవంత్, కేటీఆర్ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్(Cyberabad Commissionerate) పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ అవినాష్ మహంతి(CP Avinash Mahanty) ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలో సామాన్య కార్యకర్త సీఎం అయ్యే అవకాశాలున్నాయని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Union Minister Dharmendra Pradhan) తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సామాన్యుడు సీఎం అవుతాడని చెప్పారు.
జీహెచ్ఎంసీ కౌన్సిల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒకరినొకరు కార్పొరేటర్లు కొట్టుకున్నారు.. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది..