Share News

HYD: ఆ రోజుల్లోనే అక్కినేని పాన్‌ ఇండియా నటుడు

ABN , First Publish Date - 2023-10-21T08:31:29+05:30 IST

నటనలో శిఖరాగ్రాలను అందుకున్న అక్కినేని అప్పట్లోనే పాన్‌ ఇండియా నటుడు అయ్యారని ఎస్వీ యూనివర్సిటీ

HYD: ఆ రోజుల్లోనే అక్కినేని పాన్‌ ఇండియా నటుడు

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): నటనలో శిఖరాగ్రాలను అందుకున్న అక్కినేని అప్పట్లోనే పాన్‌ ఇండియా నటుడు అయ్యారని ఎస్వీ యూనివర్సిటీ వీసీ ఆచార్య కొలకలూరి ఇనాక్‌(Kolkaluri Inac) అన్నారు. శుక్రవారం ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో అమెరికా డల్లాస్‏లోని ప్రిస్కోలో అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) శత జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నటసామ్రాట్‌ అక్కినేని - ఆకృతి జాతీయ పురస్కారాన్ని, ‘అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా’ అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్‌కు ఆచార్య కొలకలూరి ఇనాక్‌ ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో విశేష సేవలు అందిస్తూ.. అక్కినేని పేరిట అనేక కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్‌ తోటకూర ప్రసాద్‌కు అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందించడం ఎంతో సముచితమని అన్నారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత తోటకూర ప్రసాద్‌ మాట్లాడుతూ తనకు లభించిన ఈ పురస్కారం ఎంతో ప్రత్యేకమైనదన్నారు. అక్కినేనితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, అక్కినేని ఫౌండేషన్‌ బోర్డు సభ్యులు రావు కలవల, ఆకృతి సుధాకర్‌, వి. రాంభూపాల్‌ రావు, ఇంద్ర కరణ్‌, డాక్టర్‌ వర్ష, మోహన్‌, రవీందర్‌లు పాల్గొన్నారు. గాయకులు చంద్రహాస్‌, ప్రభాకర్‌ కోట, లక్ష్మీ భారతి అక్కినేని చిత్ర గీతాలను ఆలపించారు.

AKKI.jpg

Updated Date - 2023-10-21T08:31:29+05:30 IST