Hyderabad: చలితో గజ.. గజ.. పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు
ABN , Publish Date - Dec 19 , 2023 | 08:50 AM
చలితో నగరవాసులు గజ.. గజ వణికిపోతున్నారు. ఉదయం, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు తక్కువగా నమోదవుతుండటంతో
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): చలితో నగరవాసులు గజ.. గజ వణికిపోతున్నారు. ఉదయం, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు తక్కువగా నమోదవుతుండటంతో చలిగాలుల తీవ్రత అధికంగా ఉంటోంది. పటాన్‌చెరు, రామచంద్రాపురం(Patancheru, Ramachandrapuram)లో సోమవారం అత్యల్పంగా 14.8, రాజేంద్రనగర్ - 14.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి కారణంగా వాకింగ్ చేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. మరో రెండు రోజులు పాటు గరిష్ఠంగా 27, కనిష్ఠంగా 16 డిగ్రీల వరకు మాత్రమే ఉష్ణోగ్రతలు ఉంటాయని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
పలు ప్రాంతాల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు
ప్రాంతం ఉష్ణోగ్రత
రాంచంద్రాపురం 14.8
రాజేంద్రనగర్ 14.9
సికింద్రాబాద్ 15.4
కుత్బుల్లాపూర్ 15.7
హయత్‌నగర్ 15.8
మల్కాజిగిరి 16.3
గాజులరామారం 16.3
కూకట్‌పల్లి 16.7
బేగంపేట 16.9