ఆర్టీసీకి 550 విద్యుత్తు బస్సులు
ABN , First Publish Date - 2023-03-07T03:23:24+05:30 IST
వాహన కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా..
ఒలెకా్ట్ర గ్రీన్ టెక్‌కు రూ.1000 కోట్ల ఆర్డర్
జీహెచ్‌ఎంసీలో తిప్పడానికి 500 బస్సులు
హైదరాబాద్-విజయవాడ మధ్య 50
రెండేళ్లలో 3400 బస్సుల కొనుగోలు
దశలవారీగా తీసుకురానున్న ఒలెక్ర్టా సంస్థ
హైదరాబాద్ సిటీ/బిజినెస్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): వాహన కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా.. రాబోయే రెండేళ్లలో 3400 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది! అందులో భాగంగా.. మేఘా ఇంజనీరింగ్ సంస్థకు చెందిన ఒలెకా్ట్ట్ర గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓజీఎల్)కు రూ.1000 కోట్ల విలువైన 550 ఎలక్ట్రిక్ బస్సుల అర్డర్ ఇచ్చింది. వాటిలో 500 ఇంట్రాసిటీ బస్సులు కాగా.. మిగతా 50 ఇంటర్ సిటీ ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు. ఇంటర్‌సిటీ బస్సులను హైదరాబాద్-విజయవాడ మధ్య టీఎస్ ఆర్టీసీ నడపనుంది. ఇక 500 ఇంట్రాసిటీ ఎలక్ట్రిక్ బస్సులను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిప్పనున్నారు. ఇంట్రాసిటీ బస్సులను ఒక్కసారి చార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం.. ఇంటర్‌సిటీ బస్సులు 325 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయని అధికారులు చెబుతున్నారు.
2025 మార్చి నాటికి హైదరాబాద్ అంతటా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తునట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. మొదటి దశలో 550 ఈ-బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) పద్ధతిలో తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ బస్సులను విడతల వారీగా అందుబాటులోకి తెస్తామని ఒలెకా్ట్ట్ర గ్రీన్ టెక్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చెప్పారు. ఎలక్ర్టిక్ బస్సులు నగరంలో ధ్వని,వాయు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రయాణికులకు స్వచ్ఛమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తాయన్నారు. కాగా.. ఒలెకా్ట్ర విద్యుత్తు బస్సుల నిర్వహణ, విస్తరణ, కార్యకలాపాల కోసం టీఎ్‌సఆర్టీసీ గ్రేటర్ జోన్‌లో ఐదు డిపోలను కేటాయించింది. దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్, జీడిమెట్ల, మియాపూర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బస్ డిపోల్లో ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లతో పాటు ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టనున్నారు.