Begumpet: మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న అన్నదమ్ముల అరెస్ట్‌

ABN , First Publish Date - 2023-02-05T11:12:15+05:30 IST

మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ఇద్దరు సోదరులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జమ్ము కశ్మీర్‌ నుంచి

Begumpet: మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న అన్నదమ్ముల అరెస్ట్‌

హైదరాబాద్/బేగంపేట: మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ఇద్దరు సోదరులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జమ్ము కశ్మీర్‌ నుంచి నగరానికి వచ్చిన షౌకత్‌ అలీ, బషీర్‌ మహమద్‌ అన్నదమ్ములు. వారిద్దరూ హోండాయాక్టీవా వాహనంపై మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం. నవనీత బృందం ప్యారడైజ్‌ సర్కిల్‌ లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1.1కిలో గంజాయి, 200 గ్రాముల పాపీస్ర్టా, ద్విచక్ర వాహ నం, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై ప్రేమ్‌కుమార్‌రెడ్డి, సిబ్బందిని ఇన్‌స్పెక్టర్‌ నవనీత అభినందించారు.

Updated Date - 2023-02-05T11:12:16+05:30 IST