Hyderabad: అమరవీరుల కుటుంబసభ్యుల అరెస్టు
ABN , First Publish Date - 2023-06-22T16:54:06+05:30 IST
హైదరాబాద్: సచివాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన తెలుపుతున్న అమరవీరుల కుటుంబసభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అమరవీరుల స్థూపం ఆవిష్కరణకు తమను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: సచివాలయం (Secretariat) దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన తెలుపుతున్న అమరవీరుల కుటుంబసభ్యులను (Martyrs Family Members) పోలీసులు అరెస్టు చేశారు. అమరవీరుల స్థూపం ఆవిష్కరణకు తమను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను విస్మరించారంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో తమ గోడును వెల్లబోసుకున్నారు.
ఒకవైపు తెలంగాణ దశాబ్ది వేడుకల ముగింపు సమావేశాలు కొనసాగిస్తూనే.. ఇంకొకవైపు అమరవీరుల దినోత్సవం జరుపుతున్నారు. అందులో భాగంగా అమర జ్యోతిని ఈరోజు సాయంత్రం సీఎం కేసీఆర్ (CM KCR) ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం పంపలేదు. అయితే తమకు ఎందుకు ఆహ్వానించలేదని అమరవీరుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సచివాలయం వద్దకు వచ్చి నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబ సభ్యులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ అధికారులు ఆరు కుటుంబాలకే ఆహ్వానాలు ఇచ్చారని, ఆ ఆరు కుటుంబాలతోనే తెలంగాణ వచ్చిందా? అని ప్రశ్నించారు. 12 వందలమంది తల్లి కడుపు కోతలు ఏమవుతాయని వారు నిలదీశారు. సీఎం కేసీఆర్ను కలుస్తామని మీడియా ద్వారా చాలా సార్లు తెలియజేశామని.. ఇంతవరకు ముఖ్యమంత్రి తమను పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చినప్పుడు 12 వందల మంది బలదానం చేసుకున్నారని చెప్పారని, ఇప్పుడు 6 వందలమందిని మాత్రమే గుర్తించారని, 12 వందల మందిని గుర్తించాలని వారు కోరుతూ భావోద్వేగానికి లోనయ్యారు.