పార్టీ పేరు మార్చినంత మాత్రాన.. కొత్త భవనానికి భూమి ఇస్తారా?: షర్మిల

ABN , First Publish Date - 2023-06-07T03:53:41+05:30 IST

‘‘ఒక రాష్ట్రంలో.. ఒక రాజకీయ పార్టీకి రెండు కార్యాలయాలా? పార్టీ పేరు మార్చినంత మాత్రాన కొత్త భవనం కట్టుకునేందుకు ప్రభుత్వ భూమిని ఇచ్చేస్తారా?’’

పార్టీ పేరు మార్చినంత మాత్రాన.. కొత్త భవనానికి భూమి ఇస్తారా?: షర్మిల

హైదరాబాద్‌, జూన 6 (ఆంధ్రజ్యోతి): ‘‘ఒక రాష్ట్రంలో.. ఒక రాజకీయ పార్టీకి రెండు కార్యాలయాలా? పార్టీ పేరు మార్చినంత మాత్రాన కొత్త భవనం కట్టుకునేందుకు ప్రభుత్వ భూమిని ఇచ్చేస్తారా?’’ అంటూ వైఎ్‌సఆర్టీపీ అధినేత్రి షర్మిల ప్రశ్నించారు. కారు చౌకగా ప్రభుత్వ భూములు కాజేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడానికి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టివ్వడానికి, చివరికి జర్నలిస్టులకు ఇవ్వడానికీ స్థలాలు దొరకవు.. కానీ అధికార పార్టీ కార్యాలయానికి మాత్రం అడగగానే దొరుకుతాయా అని ప్రశ్నించారు. ఈమేరకు మంగళవారం ఆమె ట్వీట్‌ చేశారు.

Updated Date - 2023-06-07T03:53:41+05:30 IST