Chanda Nagar: చందానగర్ ఎంఎంటీఎస్ స్టేషన్ దగ్గర గానీ బైక్ పార్క్ చేస్తున్నారా..?
ABN , First Publish Date - 2023-02-20T13:01:57+05:30 IST
వందల సంఖ్యలో వాహనాలు పార్కింగ్. ఎండకు ఎండి, వానకు తడిసి, వాహనాల రంగుమారుతున్నాయి. వాహనాలకు షెడ్డు ను ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా రైల్వే అధికారులు పట్టించుకోవడంలేదు.
చందానగర్ (ఆంధ్రజ్యోతి): వందల సంఖ్యలో వాహనాలు పార్కింగ్ (Vehicle Parking)లో ఎండకు ఎండి, వానకు తడిసి, వాహనాల రంగుమారుతున్నాయి. వాహనాలకు షెడ్డు ను ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా రైల్వే అధికారులు పట్టించుకోవడంలేదు.
చందానగర్ ఎంఎంటీఎస్ (Chanda Nagar MMTS) రైల్వే స్టేషన్ (Railway Station) ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తి అయింది. నాటి నుంచి నేటి వరకు ఈ స్టేషన్ నుంచి రాకపోకల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో జంట నగరాల్లో(Twin Cities) విధులు నిర్వహించేందుకు, విద్యాభ్యాసానికి ఇంటినుంచి కార్లు, ద్విచక్రవాహనాలతో స్టేషన్ వరకు వస్తారు. విద్యా, ఉద్యోగ, ఉపాధిరంగాల్లో విధులు నిర్వహించేందుకు జంటనగరాలకు వందల సంఖ్యలో రాకపోకలు కొనసాగిస్తున్నారు. వాహనాల పార్కింగ్ స్థలం (Vehicle Parking Place)లో షెడ్డు లేక పోవడంతో ఎండ, వాన, చలికి వాహనాల రంగుమారుతున్నాయి. పార్కింగ్ షెడ్డు ను ఏర్పాటు చేయాలని పలుమార్లు రైల్వే అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాహనదారులు వాపోతున్నారు.
షెడ్డు ఏర్పాటు చేయాలి
చందానగర్ ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ వరకు వాహనాలపై వచ్చి అక్కడ పార్కింగ్ చేసి వెళ్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వాహనాలు నీడ లేకపోవడంతో వాహనాల రంగు మారుతున్నాయి. విషయాన్ని సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. వెంటనే షెడ్ ను ఏర్పాటు చేయాలి.
- కొండల్ రెడ్డి, పాపిరెడ్డినగర్ కాలనీ, సంక్షేమ సంఘం అధ్యక్షుడు
దుమ్ము పట్టి పోతున్నాయి
పార్కింగ్ షెడ్ లేకపోవడంతో విలువైన వాహనాలు, దుమ్ము కొట్టుకుపోయి, ఎండకు ఎండి రంగు పోతున్నాయి. రైల్వే అధికారులు షెడ్ ఏర్పాటు చేయాలి.
యాదగిరి, ప్రయాణికుడు